నూతన పంచాయతీల అభివృద్ధికి కృషి
ABN , First Publish Date - 2020-12-11T05:41:10+05:30 IST
నూతన పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. గురువారం డొడర్న రాంనాయక్, దావూజీతండాల్లో మురికి కాలువల నిర్మాణం, గ్రావెల్‌రోడ్డు మరమ్మతుల కోసం భూమి పూజ చేసి ప్రారంభించారు.
కుభీర్, డిసెంబరు 10 : నూతన పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. గురువారం డొడర్న రాంనాయక్, దావూజీతండాల్లో మురికి కాలువల నిర్మాణం, గ్రావెల్‌రోడ్డు మరమ్మతుల కోసం భూమి పూజ చేసి ప్రారంభించారు. రాంనాయక్ తండాలో రూ.45 లక్షలతో భవానిమాత ఆలయ ని ర్మాణం కోసం నివేదికలను తయారు చేసి ప్రభుత్వానికి అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ గంగాచరణ్, జడ్పీటీసీ అల్కతాయి సంజయ్, వైస్ ఎంపీపీ మోహియోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. బంక భోజన్న, సత్వాగౌడ్, పుప్పాల పీరాజీల కుటుంబ సభ్యులను గురువారం ఎమ్మెల్యే పరామర్శించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గంగాచరణ్, నా యకులు కందూర్ సంతోష్, రాజేశ్వర్ పాల్గొన్నారు. విఠలేశ్వర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు. డొడర్న, రాంనా యక్ తండా, దావూజీనాయక్‌తం డాల నుంచి ఆయా పార్టీల నుంచి 10 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి ఎమ్మె ల్యే కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రైతులకు మరింత చేరువలో సేవలు
భైంసా క్రైం : ధరణి పోర్టల్‌తో రైతులకు సేవలు మరింత చేరువయ్యాయని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. గురువారంం తహసీల్ కార్యాలయంలో రిజిస్ర్టేషన్ కార్యాలయానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షు డు కృష్ణ, రాము, రమణారెడ్డి, మంత్రి భోజారాం పాల్గొన్నారు.