భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి

ABN , First Publish Date - 2020-11-13T10:33:25+05:30 IST

గూడెం సత్యనారాయణస్వామి దేవాలయంలో ఈనెల 30న జరిగే కార్తీక పౌర్ణమి జాతరకు వచ్చే భక్తుల కు ఎలాంటి ఇబ్బం దు లు తలెత్తకుండా చూ డాలని వరంగల్‌ దేవా దాయ ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌

భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి

గూడెంలో కార్తీక జాతర ఏర్పాటుపై డీసీ పరిశీలన 


దండేపల్లి, నవంబ రు 12 : గూడెం సత్యనారాయణస్వామి దేవాలయంలో ఈనెల 30న జరిగే కార్తీక పౌర్ణమి జాతరకు వచ్చే భక్తుల కు ఎలాంటి ఇబ్బం దు లు తలెత్తకుండా చూ డాలని వరంగల్‌ దేవా దాయ ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ వి.విజయరామారావు పేర్కొన్నారు. గురువారం ఆలయ పరి సర ప్రాంతాల్లో జాతర ఏర్పాట్లను పరిశీలించారు. కొవిడ్‌ 19 నిబంధనల ప్రకా రం ఏర్పాట్లు చేయాలన్నారు. ఘాట్‌రోడ్డు నుంచి గుట్టపైకి స్వామి దైవదర్శనానికి, గుట్ట కిందికి దిగేందుకు మరో దారి ఏర్పాటు చేయాలన్నారు. మంచి నీటి వసతి, క్యూలైన్‌, క్లాక్‌ రూములు, ప్రసాద కౌంటర్లు, ప్రత్యేక దర్శనం టికెట్‌ కౌంటర్‌, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదానం, కార్యక్రమాలతోపాటు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. షామియాలు, చలువ పందిర్లలను ఏర్పాటు చేయాలన్నారు. ఈవో వడ్లూరి అనూష, సిబ్బంది, అర్చకులు ఉన్నారు.    

Updated Date - 2020-11-13T10:33:25+05:30 IST