కరోనా పాజిటివ్‌తో మరొకరి మృతి
ABN , First Publish Date - 2020-04-21T09:04:01+05:30 IST
కరోనా పాజిటివ్ లక్షణాలతో జిల్లాకు చెందిన మరో వ్యక్తి సోమవారం మరణించారు.

నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా సంఘటన
మూడుకు చేరిన మృతుల సంఖ్య
తానూర్‌కు కలెక్టర్, ఎస్పీలు
నిర్మల్, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి)/తానూర్: కరోనా పాజిటివ్ లక్షణాలతో జిల్లాకు చెందిన మరో వ్యక్తి సోమవారం మరణించారు. తానూర్ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి గత కొద్ది రోజుల నుంచి తీవ్రమైన దగ్గు, జలుబు జ్వరంతో భాధపడుతూ నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం ఆయన పరిస్థితి విషమించడం, ఆయనకు కరోనా లక్షణా లు బయటపడడంతో వైద్యులు ఆయనను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించగా.. మార్గమద్యలోమృతి చెందాడు. అంతేకాకుండా ఆయనకు వైద్య చికిత్సలు చేసిన వైద్య సిబ్బందితో పాటు సమీప బంధువులు 26మందిని నిర్మల్‌లోని క్వారంటైన్‌కు తరలించారు.
కాగా సమాచారం తెలుసుకున్న కలెక్టర్ ముషారప్ ఆలీ పారూఖీ, డీఎంహెచ్‌ఓతో పాటు అధికారులంతా తానూర్‌కు చేరుకొని పరిస్థితులను సమీక్షించారు. కాగా, జిల్లాలో ఇప్పటి వరకు 19 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు సోకగా.. ముగ్గురు మృతి చెందారు. గత వారం పది రోజుల నుంచి కరోనా అనుమానితుల్లో ఎవరికీ బయటపడలదేఉ. అయితే సోమవారం తానూర్‌కు చెందిన వ్యక్తి అవే లక్షణాలతో మరణించడంతో అధికార యంత్రాంగం ఆందోళనకు గురవుతోంది. ఈ సంఘటనతో తానూర్ మండల కేంద్రాన్ని కట్టడి ప్రాంతంగా ప్రకటించారు.