భక్తిశ్రద్ధలతో దత్తజయంతి

ABN , First Publish Date - 2020-12-30T06:22:29+05:30 IST

నిర్మల్‌ మండలం మంజులాపూర్‌లోని సాయిబాబా ఆలయంలో మంగళవారం దత్త జయంతి ఘనంగా నిర్వహించారు. సాయిబాబాకు అభిషేకం హారతి పూజలు జరిపారు.

భక్తిశ్రద్ధలతో దత్తజయంతి
మంజులాపూర్‌ ఆలయంలో దత్త జయంతి పూజ

నిర్మల్‌ కల్చరల్‌, డిసెంబరు 29 : నిర్మల్‌ మండలం మంజులాపూర్‌లోని సాయిబాబా ఆలయంలో మంగళవారం దత్త జయంతి ఘనంగా నిర్వహించారు. సాయిబాబాకు అభిషేకం హారతి పూజలు జరిపారు. లక్కిడి జగన్మోహన్‌ రెడ్డితో పాటు కౌన్సిలర్‌ రూప చిన్నయ్య, నరేష్‌, లింగారెడ్డి, భక్తులు పాల్గొన్నారు. వెంగ్వాపేట్‌లో జగన్మోహన్‌రెడ్డిని సన్మానించారు. జిల్లాకేంద్రంలోని గండిరామన్న దత్తసాయి మందిరంలో శ్రీ దత్తజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు అప్పాల మహేష్‌, ప్రధాన కార్యదర్శి గంధె సుధీర్‌, పోడెల్లి చిన్న, బురాజ్‌, వెన్నెల చిన్నయ్య, భక్తులు పాల్గొన్నారు.  పట్టణంలోని దత్తాత్రేయ నగర్‌లో కొలువైన దత్తాత్రేయ ఆలయంలో దత్త జయంతిని నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి దేవేందర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు పాకాల రాంచందర్‌తో పాటు భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

భైంసా రూరల్‌ : మండలంలోని దేగాం, వాలేగాం, వానల్‌పాడ్‌, బిజ్జూర్‌ గ్రామాలలో మంగళవారం వైభవోపేతంగా దత్త జయంతి వేడుకలు జరిగాయి.  దేవతామూర్తులకు పాలాభిషేకం క్షీరాభిషేకం గావించి ప్రత్యేకంగా అలంకరించి అనం తరం వేద పండితుల, అర్చకుల వేద మంత్రోచ్చరణ మధ్య ప్రత్యేకఅర్చన గావించారు. ఉదయం నుండే వేలాది మంది భక్తులు దత్తాత్రేయున్ని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేకంగా అలంకరించిన ఉయ్యాల ఏర్పాటు చేసి దత్తాత్రేయుని జన్మదినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తుల, అర్చకుల వేద మంత్రాల మధ్య దేవుని జన్మదిన వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయాల్లో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జాతర సందర్భంగా తినుంబడారాలు, పిల్లల ఆట వస్తువుల దుకాణాల సముదాయాలు వెలిశాయి. ఆలయకమిటీ సౌకర్యాలు కల్పించింది. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 

కల్లూర్‌ సాయిబాబా ఆలయంలో..

కుంటాల :  మండలంలోని కల్లూర్‌ దత్తవెంకటసాయి ఆలయంలో మంగళవారం దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఈ నెల 20వ తేదీన ప్రారంభ మైన ఉత్సవాలు మంగళవారంతో ముగిసాయి. దత్తజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌, మహారాష్ట్ర నుంచి భక్తులు అధికసంఖ్యంలో హాజరయ్యారు. కుంటాల ఎస్సై శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. 

సోన్‌ : మండలంలోని న్యూవెల్మల్‌ సాయిబాబా ఆలయంలో మంగళవారం దత్తసాయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.  బీజేపీ నాయకులు అప్పాల గణేష్‌ చక్రవర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

నిర్మల్‌టౌన్‌ : దత్త జయంతి వేడుకలను పురస్కరించుకొని మంగళవారం గోదావరి కృష్ణ జలాల రాష్ట్ర కన్వీనర్‌ రావుల రాంనాథ్‌ దత్తశ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారులు ఆయనకు తీర్థ ప్రసాదాలనందించారు. 

Updated Date - 2020-12-30T06:22:29+05:30 IST