దళితులకు మూడెకరాల స్థలం కేటాయించాలి

ABN , First Publish Date - 2020-12-29T05:09:34+05:30 IST

సీఎం కేసీఆర్‌ దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు దళితబస్తీ పథకంలో అర్హులైన వారికి మూడెకరాల స్థలాన్ని కేటాయించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఎస్సీ కార్పొరేషన్‌ ఎదుట ధర్నా చేపట్టారు.

దళితులకు మూడెకరాల స్థలం కేటాయించాలి
ఎస్సీ కార్పొరేషన్‌ ఎదుట ధర్నాలో మాట్లాడుతున్న పాయల శంకర్‌

బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌  

తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టిన పార్టీ నాయకులు 

ఆదిలాబాద్‌టౌన్‌, డిసెంబరు 28: సీఎం కేసీఆర్‌ దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు దళితబస్తీ పథకంలో అర్హులైన వారికి మూడెకరాల స్థలాన్ని కేటాయించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఎస్సీ కార్పొరేషన్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ దళితు లకు 3 ఎకరాల భూమి, బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయడంతో పాటు  అర్హులైన వారికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌కు వినతి పత్రం అందించారు. ఇందులో దళిత మోర్చా అధ్యక్షుడు సుభాష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ధరంపాల్‌, కౌన్సిలర్లు ఆకుల ప్రవీణ్‌, నాయకులు పాల్గొన్నారు.

జైనథ్‌: దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ మండల అధ్యక్షుడు కట్కం రాందాస్‌ విమర్శించారు. సోమవారం బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్‌ మహేంద్రనాథ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా మండల అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.

నేరడిగొండ: రాష్ట్ర ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమిని వెంటనే అందించాలని సోమవారం బీజేపీ నాయకులు డిప్యూటీ తహసీ ల్దార్‌ సమీర్‌ఖాన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గంగారాం కుర్మే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి పేద దళితులకు మూడెకరాల భూమిని వెంటనే అందించాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్ర మంలో మండల కన్వీనర్‌ సోసయ్య హీరరాసింగ్‌, సోషల్‌ మిడియా కన్వీ నర్‌ సంతోష్‌సింగ్‌, ప్రదాన కార్యదర్శి ప్రశాంత్‌, నాయకులు పాల్గొన్నారు.

బజార్‌హత్నూర్‌: మండంలలోని దళితులకు ప్రభుత్వం వెంటనే 3 ఎకరాల భూమిని పంపిణీ చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు గోసుల నాగరాజు అన్నారు. సోమవారం పార్టీ నాయకులతో కలిసి తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కేవల్‌సింగ్‌, నాయకులు మేకల లింగన్న, సంతోష్‌, గాజుల రాకేష్‌ పాల్గొన్నారు.

ఉట్నూర్‌: రాష్ట్రంలోని దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని బీజేపి మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు కడమండ్ల రాజమణి ఆరోపించారు. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే మొదటి ముఖ్యమంత్రిగా దళితున్ని చేస్తానని ప్రకటించిన సీఎం తానే కుర్చీపై కూర్చొని దళితులకు మోసం చేశారని విమర్శించారు. దళితులందరకీ మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తామని ప్రకటించి ఆరేళ్లు కావస్తున్నా అమలు చేయలేదన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కొలిపాక రాజేశఖర్‌, జిల్లా కార్యదర్శి కోండేరి రమేష్‌, నాయకులు పాల్గొన్నారు. 

నార్నూర్‌: దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు శివాజీ ఉన్నారు. సోమవారం గాదిగూడ మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలతో కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి అఽధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించారన్నారు. కార్యక్రమంలో గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు మరప రాజు తదితరులున్నారు.

ఇంద్రవెల్లి: దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని బీజేపీ మండల అధ్యక్షుడు ఆరెల్లి రాజలింగు అన్నారు. సోమవారం బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక తహసీల్దార్‌ కార్యాలంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని ఆయ న పేర్కొన్నారు.  దళితులకు మూడు ఎకరాల భూమి తప్పకుండా ఇవ్వాల ని డిమాండ్‌ చేశారు. లేకుంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు దీపక్‌సింగ్‌ షేకావత్‌, చంపత్‌రావు, పడ్వాల్‌ గోపాల్‌సింగ్‌, ఎంపీటీసీ సభ్యులు పడ్వాల్‌ విజయ్‌సింగ్‌ , ముండే రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-29T05:09:34+05:30 IST