‘డర్టీ హరి’ నిర్మాతపై కేసు నమోదు
ABN , First Publish Date - 2020-12-15T06:20:46+05:30 IST
డర్టీ హరి సినిమా నిర్మాత శివరామకృష్ణతో పాటు ప్రచార ఏజెన్సీపై జూబ్లీహిల్స్ పోలీ్‌సస్టేషన్‌లో క్రిమినల్ కేసు

జారాహిల్స్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): డర్టీ హరి సినిమా నిర్మాత శివరామకృష్ణతో పాటు ప్రచార ఏజెన్సీపై జూబ్లీహిల్స్ పోలీ్‌సస్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. డర్టీ హరి సినిమా ప్రమోషన్‌లో భాగంగా వెంకటగిరి ప్రాంతంలోని మెట్రో పిల్లర్లకు పోస్టర్లను అంటించారు. యువతను తప్పుదోవ పట్టించేలా, స్ర్తీలను అవమానించేలా పోస్టర్లు ఉన్నాయని గుర్తించిన పోలీసులు సుమోటోగా కేసు తీసుకొని నిర్మాతతోపాటు ప్రచార ఏజెన్సీపై మహిళా చట్టం 292, సెక్షన్ 3, 4, 6 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.