‘పత్తి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి’

ABN , First Publish Date - 2020-06-06T11:15:49+05:30 IST

ఆసియా ఖండంలోనే పత్తిని ప్రధాన పంటగా పండించే కేంద్రబిందువైన ఆదిలాబాద్‌ జిల్లాలోనే పత్తి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని

‘పత్తి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి’

ఆదిలాబాద్‌ టౌన్‌, జూన్‌ 5: ఆసియా ఖండంలోనే పత్తిని ప్రధాన పంటగా పండించే కేంద్రబిందువైన ఆదిలాబాద్‌ జిల్లాలోనే పత్తి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఓయూ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో పత్తి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం శుభ సూచకమని, ఆ కేంద్రాన్ని తప్పకుండా ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేయాలని శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కోరారు. ఇందులో నాయకులు అరుణ్‌కుమార్‌, ప్రజా సంఘాల నాయకులు బద్ధం పురుషోత్తంరెడ్డి, విద్యార్థి నాయకులు ప్రేమేందర్‌, మర్రి వెంకన్న, తదితరులున్నారు.

Updated Date - 2020-06-06T11:15:49+05:30 IST