‘పత్తి కొనుగోళ్ల నిలిపివేత’

ABN , First Publish Date - 2020-12-12T04:57:55+05:30 IST

బోథ్‌ మార్కెట్‌ కమిటీ పరిధి లోని జిన్నింగ్‌లలో ఈనెల 15వరకు పత్తి కొనుగోళ్లను నిలిపి వేస్తున్నట్లు బోథ్‌ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి నార మనోహార్‌ తెలిపారు.

‘పత్తి కొనుగోళ్ల నిలిపివేత’

బోథ్‌, డిసెంబరు11: బోథ్‌ మార్కెట్‌ కమిటీ పరిధి లోని జిన్నింగ్‌లలో ఈనెల 15వరకు పత్తి కొనుగోళ్లను నిలిపి వేస్తున్నట్లు బోథ్‌ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి నార మనోహార్‌ తెలిపారు. శని, ఆది, సోమవారాలు రెండవ శనివారంతో పాటు ఆమావాస్య రావడంతో పత్తి కొనుగోళ్లు జరుగవని ఆయన తెలిపారు. తిరిగి 15న మంగళవారం పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతా యన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి మార్కెట్‌ కు పత్తిని తీసుకు రావద్దన్నారు. ఇక పత్తిని అమ్మే రైతు లు తమ రక్త సంబంధీకులను పంపించాలని, ఇతరుల ను పంపవద్దని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-12-12T04:57:55+05:30 IST