‘ఎలుగుబంట్ల భయంతోనే పత్తి ఏరలేక పోతున్నాం’

ABN , First Publish Date - 2020-12-06T07:00:14+05:30 IST

ఆరుకాలం కష్టించి పండించిన పత్తి పంట ను ఎలుగుబంట్ల భయంతో ఏరలేక పోతున్నామని గిరిజన రైతులు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు.

‘ఎలుగుబంట్ల భయంతోనే పత్తి ఏరలేక పోతున్నాం’
ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజన రైతులు

తలమడుగు, డిసెంబరు 5: ఆరుకాలం కష్టించి పండించిన పత్తి పంట ను ఎలుగుబంట్ల భయంతో ఏరలేక పోతున్నామని గిరిజన రైతులు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. శనివారం మండలంలోని ఉమ్రి పంట పొలాల్లో రైతులు మాట్లాడుతూ కోసాయి, దేగామ, పల్సి(బి), పల్సి తాండ, కప్పర్‌దేవి, ఝరి, నందిగామ, బరంపూర్‌ తదితర గ్రామాల్లోని పత్తి పంటలో ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయని, పత్తిని ఏరేందుకు కూలీలు భయపడుతున్నారన్నారు. ఇటీవలనే నందిగామ గ్రామానికి చెందిన రైతును ఎలుగుబంటి తీవ్రంగా గాయపరిచినప్పటికీ, సంబంధిత అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. ఎలుగుబంటిని ఎవరైనా హతమారిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని అటవి శాఖ అధికారులే భయపెడుతున్నారన్నారు. దీంతో గిరిజన రైతులు పత్తి పంటను, ఇతర పంట దినుసులను చేనులో నుంచి ఇంటికి తెచ్చేందుకు అనేక ఇబ్బందుల కు గురవుతున్నారు. అంతేకాకుండా  ఎలుగుబంటితో పాటు అడవి పందు లు సైతం పంటలను ధ్వంసం చేస్తున్నాయన్నారు. ఐదు ఎకరాల పొలంలోను మూడు ఎకరాల పంటను అడవి పందులు ధ్వంసం చేయడం వల్ల చేతికొచ్చే పంట నేల పాలవుతుందన్నారు. అడవి జంతువుల వల్ల నష్ట పోయిన పంటలకు నష్టపరిహారం అందించాల్సి ఉన్నా.. గత రెండు సంవత్సరాల నుంచి ఏఒక్క రైతుకు కూడా ఇప్పటి వరకు పంట నష్టపరిహారం అందించ లేదన్నారు. ఇకనైనా అటవీ శాఖాధికారులు స్పందించి పంట పొలాల్లో సంచరిస్తున్న ఎలుగుబంట్లు, అడవిపందుల దాడి  నుంచి కాపాడాలని గిరిజనులు కోరుతున్నారు. ఇందులో ఉమ్రి పటేల్‌ పెందూర్‌ మాదవ్‌రావ్‌, సంతోష్‌, మనోహార్‌, తదితరులు పాల్గొన్నారు. 

Read more