కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
ABN , First Publish Date - 2020-04-21T09:05:48+05:30 IST
భైంసాలో కరోనా నియంత్రణ చర్యలు కట్టుదిట్టంగా కొనసాగుతున్నాయి.

భైంసా, ఏప్రిల్ 20: భైంసాలో కరోనా నియంత్రణ చర్యలు కట్టుదిట్టంగా కొనసాగుతున్నాయి. పోలీసు, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, ఫైర్, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ కరోనా నియంత్రణకు, వ్యాప్తి నిరోధానికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు. పట్టణ పరిధిలో ఇప్పటి వరకు ఐదు పా జిటివ్ కేసులు నమోదు అవ్వగా.. ఇందులో చివరి పాజిటివ్ కేసు ఈనెల 10 నమోదైంది.
అనంతరం ఇక్కడి నుంచి 30పైగా రక్తనమునాలు సేకరించి పంప గా వాటి ఫలితాలు నెగేటివ్ వచ్చినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ఐదు పాజిటివ్ కేసులు నమోదైన నాటి నుంచి అధికారులు అన్ని విధాలుగా అప్రమత్తతతో వ్యవహరించడం మూలంగా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. క్వారంటైన్ నుంచి వచ్చిన వారితో పాటు విదేశాల నుంచి వారి ఆరోగ్య పరిస్థితులపై వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి కొనసాగుతోంది. రోజు ఉదయం పూట మూడు గంటల పాటు కట్టడి ప్రాంతాల ఇన్‌చార్జీల సారథ్యంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు క్వారంటైన్, విదేశాల నుంచి వచ్చిన వారి ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య వివరాలను నమోదు చేసుకుంటూ ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు.
కాగా, సోమవారం నుంచి పట్టణంలోకి వచ్చే ప్రతీఒక్కరికి ప్రవేశమార్గాల్లో ఏర్పా టు చేసిన పోలిస్ పికెట్ కేంద్రాల వద్ద స్ర్కీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అం తేకాకుండా కట్టడి ప్రాంతాలలో రెండు రోజులుగా అగ్నిమాపక శాఖ సేవలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పట్టణ పరిధిలో పోలీసు అఽధికారులు లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలుపరుస్తున్నారు.