రిమ్స్‌లో కరోనా టెస్టులు

ABN , First Publish Date - 2020-05-13T07:10:05+05:30 IST

కరోనా వైరస్‌ కేసులు రాష్ట్రంలో పెరుగుతున్న నేపథ్యంలో రిమ్స్‌లోనూ కరోనా వైరస్‌ టెస్టులు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.

రిమ్స్‌లో కరోనా టెస్టులు

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు


ఆదిలాబాద్‌టౌన్‌, మే 12: కరోనా వైరస్‌ కేసులు రాష్ట్రంలో పెరుగుతున్న నేపథ్యంలో రిమ్స్‌లోనూ కరోనా వైరస్‌ టెస్టులు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. అయితే ఇంతకు ముందే  టెస్టులు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రస్తుతం ల్యాబ్‌ కూడా ఏర్పాటు చేశామని  రిమ్స్‌ డైరెక్టర్‌ బలిరాం తెలిపారు. పూర్తి స్థాయిలో ఆదేశాలు వస్తే బుధవారం నుంచి టెస్టులు నిర్వహి స్తామని తెలిపారు. కాగా, జిల్లాలో 20 రోజులుగా ఎలాంటి వైరస్‌ టెస్టులు జరగడం లేదు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ టెస్టులు చేసినట్లయితే కేసులు పెరిగే అవకాశం ఉందని రిమ్స్‌ వర్గాలు చెబుతున్నాయి.

Read more