చచ్చినా వదలని కరోనా కష్టాలు!
ABN , First Publish Date - 2020-04-07T10:49:34+05:30 IST
మనుషులను కబలి స్తున్న కరోనా మహమ్మారి చివరికి ప్రాణాలు పో యినా వదలడంలేదు. పచ్చకామెర్లతో బాధపడు తూ ఆదివారం ఆదిలాబాద్ రిమ్స్‌లో ఆసుపత్రిలో

మృతదేహాన్ని ఇంటికి రానివ్వని ఇంటి యజమాని
స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంత్యక్రియలు
ఆదిలాబాద్‌టౌన్, ఏప్రిల్6: మనుషులను కబలి స్తున్న కరోనా మహమ్మారి చివరికి ప్రాణాలు పో యినా వదలడంలేదు. పచ్చకామెర్లతో బాధపడు తూ ఆదివారం ఆదిలాబాద్ రిమ్స్‌లో ఆసుపత్రిలో జిల్లాకేంద్రంలోని క్రాంతినగర్ కాలనీలో అద్దెఇంట్లో నివాసం ఉంటున్న చెర్లి దశరథ్ మృతిచెందాడు. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో దశ రథ్ మృతదేహానికి అంత్యక్రియలకు ఇంటికి తెస్తు న్నారనే సమాచారం తెలుసుకున్న ఆ ఇంటి యజ మాని ముందుగానే కాలనీవాసులతో మాట్లాడి శవా న్ని కాలనీకి తీసుకురాకుండా అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న రిమ్స్ వైద్యులు జిల్లాకేంద్రానికి చెందిన బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులను సంప్రదించి విషయం తెలియజేశారు.
స్పందించిన సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తన స భ్యులతో కలిసిదశరథ్ శవానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకొచ్చారు. మృతుడి భార్య లక్ష్మి పాడే మోసిన సభ్యులు, కొడుకు బన్ని(7)తో తండ్రికి సోమవా రం తిర్పెల్లి శ్మశానవాటికలో అంత్యక్రియలు చేయించింది. పట్టణవాసులు మానవ త్వం మరిచిన ఆ ఇంటి యజమాని తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందులో సొసైటీ సభ్యులు విఠల్, ప్రవీణ్, తాహిర్, దావుద్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.