అందరి సహకారంతోనే కరోనా కట్టడి

ABN , First Publish Date - 2020-04-26T09:44:12+05:30 IST

జిల్లాలో అందరి సహకారంతో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అరికట్టగలిగామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు.

అందరి సహకారంతోనే కరోనా కట్టడి

గాంధీ ఆసుపత్రి నుంచి ఎనిమిది మంది డిశ్చార్జి.. వారిని హోం క్వారంటైన్‌లో ఉంచాం

మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి


నిర్మల్‌, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అందరి సహకారంతో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అరికట్టగలిగామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్‌ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పొల్యూషన్‌ కంటోల్‌ బోర్డు తరపున డీపీవో ఆధ ్వర్యంలో ప్రతి గ్రామ పంచాయతీకి 50 మాస్క్‌లను పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మల్‌ జిల్లాలో అందరి సహకారంతో కరోనా వైర్‌సను అరికట్టగలిగామని తెలిపారు. కరోనా వైరస్‌ బారినపడిన 20 మందిలో నుంచి ఎనిమిది మంది పూర్తిగా కోలుకొని శుక్రవారం డిశ్చార్జి అయ్యారని తెలిపారు. డిశ్చార్జ్‌ అయిన వారిని హోం క్వారంటైన్‌లో ఉంచి ప్రతి రోజు వైద్యులచే పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.


గ్రామీణ ప్రాంత సఫాయి కార్మికారులకు ఆదివారం నుంచి సర్పంచ్‌, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీల ఆధ్వర్యంలో బియ్యం, నూనె, పప్పు అందించనున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రజలు ఇబ్బందులు గురికావద్దని ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ తెల్ల రేషన్‌ కార్డుదారులకు ప్రతీ ఒక్కరికి 12 కిలోల బియ్యం, రూ.1500 అందించడం జరిగిందని, వారికి మళ్లీ ఈనెల కూడా అందించడం జరుగుతుందన్నారు. అలాగే వలస కార్మికులు కూడా ఇబ్బంది పడకుండా  ప్రతీఒక్కరికి అందజేస్తామని, తిరిగి మే నెలలో కూడా అందజేయడం జరుగుతుందని అన్నారు.


అలాగే, తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొండాపూర్‌ రింగ్‌ రోడ్‌ వద్ద ఆదివారం అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, నిర్మల్‌ ఎంపీపీ రామేశ్వర్‌ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కే. రాంకిషన్‌ రెడ్డి, అల్లోల మురళీధర్‌ రెడ్డి, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-26T09:44:12+05:30 IST