షురూ కరోనా!!

ABN , First Publish Date - 2020-03-24T10:22:53+05:30 IST

ఆదిలాబాద్‌ జిల్లాలో శనగ పంట చేతికొచ్చిన కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో కొ నుగోలు కేంద్రాలు ప్రారంభం కావడం లేదు. పంట ఇంటికి వచ్చి నెల రోజులు గడుస్తున్న కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసేందుకు...

షురూ కరోనా!!

  • శనగ పంట కొనుగోళ్లకు తప్పని ఎదురు చూపులు 
  • కరోనా నివారణలో అధికారులు బిజీబిజీ
  • చేతికి వచ్చినా.. ఇళ్లలోనే పంట దిగుబడులు 
  • ఆర్థిక ఇబ్బందులతో అమ్మేసుకుంటున్న రైతులు 

ఆదిలాబాద్‌, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌ జిల్లాలో శనగ పంట చేతికొచ్చిన కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో కొ నుగోలు కేంద్రాలు ప్రారంభం కావడం లేదు. పంట ఇంటికి వచ్చి నెల రోజులు గడుస్తున్న కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టడం లేదు. జిల్లా లో ప్రధానంగా సాగయ్యే పత్తి, సోయా, కంది పంటలతో పాటు రబీలో శనగ పంట అధికంగానే సాగవుతుంది. ము నుపెన్నడూ లేని విధంగా ఈ యేడు శనగ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 60వేల 500 ఎకరాలు కాగా, ఈసారి 80వేల ఎకరాల్లలో పంట సాగయ్యింది. జిల్లా వ్యాప్తంగా సబ్సిడీ ధరపై 12.510 క్వింటాళ్ల శనగ విత్తనాలను సరఫరా చేశారు. ఈ సారి 80వేల ఎకరాలలో సుమారుగా 8లక్షల క్వింటాళ్ల శనగ దిగుబడులు వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో విస్తారంగా ఉన్న నల్లరేగడి భూములకు అనువైన పంట కావడంతో ఏపుగా పెరిగిన శనగ పంట చేతికొచ్చే సమయంలో ఆకాల వర్షాలు కురవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అయిన దిగుబడులు ఆశాజనకంగానే కనిపిస్తున్నా యి. ఎకరాన 8నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తాయని అన్నదాతలు పేర్కొంటున్నారు. ఇప్పటికే కంది పంటతో నష్ట పోయిన అన్నదాతలు శనగ పంటపై భారీ ఆశలు పెట్టుకుంటున్నారు. ఈ యేడు క్వింటాల్‌ శనగలకు  ప్రభుత్వ మద్ధతు ధర రూ.4875ల ప్రకటించ గా ప్రస్తుతం బయట మార్కెట్‌లో రూ.4200ల నుంచి రూ.4500ల వరకు ధర పలుకుతోంది. అయితే కనీసం క్వింటాలుకు రూ.8వేల నుంచి 10వేల వరకు మద్ధతు ధర ఉంటేనే గిట్టుబాటు అ వుతుందని రైతులు పేర్కొంటున్నారు. మద్దతుధర ఎలా ఉన్న నెలల తరబడి కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభంకాక పో వడంతో ఎదురు చూపులు తప్పడం లేదు. కొనుగోలు కేం ద్రాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియక అన్నదాత ల పరిస్థితి అగమ్యఘోచరంగా మారుతుంది.


అధికారులు బిజీబిజీ..

కరోనా ఎఫెక్ట్‌తో జిల్లా అధికారులంతా బిజీ బిజీగా మారి పోయారు. గత పక్షం రోజులుగా వైరస్‌ నివారణ చర్యల్లోనే నిమగ్నమయ్యారు. దీంతో శనగ కొనుగోళ్లను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిం ది. మొదట అనుకున్న విధంగా ఉగాది పండుగ తర్వాత శనగ కొనుగోళ్లను ప్రారంభించాలని అధికారులు భావించిన రోజురోజుకు పెరిగి పోతున్న కరోనా వైర్‌సతో ఎప్పుడనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు కరోనా వైరస్‌ పై ప్రజలకు అవగాహన కల్పించే విధుల్లో నిమగ్నమయ్యారు. ఎలాగో కందుల కొనుగోళ్లను పూర్తి చేసిన అధికారులు శనగ కొనుగోళ్లపై దృష్టి సారించక పోవడంతో అన్నదాతలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో శనగ కొనుగోళ్లను ప్రారంభించిన మార్కెట్‌ళ్లలో రైతులు గుంపులు గుం పులుగా గుమ్మిగూడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కారణంగానే శనగ కొనుగోళ్లను ప్రారంభించేందుకు అధికారులు ఆసక్తి చూపించడం లేదు. ఎప్పుడు ప్రారంభమవుతాయో? చెప్పలేని పరిస్థితులు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.


ఇళ్లలోనే పంట దిగుబడులు

ఇప్పటికే శనగ పంటను నూర్పిడి, శుద్ధి చేసిన కొనుగోళు కేంద్రాలు ప్రారంభంకాక పోవడంతో ఇండ్లలోనే నిల్వ చేసుకుని ఎదురు చూస్తున్నారు.పంట దిగుబడులను నిల్వ చేసుకునే అవకాశం లేని రైతులు ఆరుబయటనే నిల్వ చేసి అకా ల వర్షాలకు పంట తడవకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎ ప్పుడు వర్షం కురుస్తుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయం టూ బిక్కుబిక్కుమంటున్నారు.ఇంటి నిండ పంట దిగుబడు లే ఉండడంతో ఇబ్బందికరంగా మారుతుందని పేర్కొంటున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొం దరు దళారులు గ్రామాల్లో సంచరిస్తూ నగదును ఆశ చూపుతూ విచ్చలవిడిగా పంటను కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన పంట దిగుబడులను నిల్వ చేసుకుంటున్నారు.దీంతో ఆరుగాలం కష్టపడి పంటను పండించిన అన్నదాతకు మద్దతుధర దక్కడం గగనంగానే కనిపిస్తుంది. 


ఆర్థిక ఇబ్బందులతో అమ్మేసుకుంటున్నారు

పంట కోత, నూర్పిడి కోసం ఖర్చు చేసిన అప్పులను తీ ర్చేందుకు ఆర్థిక ఇబ్బందులతో అన్నదాతలు ఆదరబాదరగా అమ్మేసుకుంటున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు జిల్లా లో ఎక్కడా ప్రారంభించకపోవడంతో దళారులకు ఎంతో కలిసి వస్తుంది. గతేడు క్వింటాలు శనగలు రూ.5వేల నుం చి రూ.6వేల వరకు పలుకడంతో ఆశపడి అధిక సాగుకు శ్రీకారం చుట్టారు. అయితే సాగు సమయంలో రూ.9500 ధర పలికిన ప్రస్థుతం క్వింటాల్‌ ధర సగానికి సగం పడిపోవడంతో దిక్కులు చూస్తున్నారు.దీంతో తీవ్ర నష్టం వాటిళ్లుతుందని ఆవేదనకు గురవుతున్నారు. అంతేకాకుండా ఇలా ప్రతియేటా అకాల వర్షాలు, దళారుల బెడద, అధికారుల నిండు నిర్లక్ష్యంతో నష్ట పోవాల్సి వస్తుందని ఆందోళన చెం దుతున్నారు. అయితే  సీజన్‌ ముగిసిన తర్వాత అధికారు లు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు. సకాలంలో జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తేనే రైతులందరికి మద్దతుధర దక్కే అవకాశం ఉంది.

Updated Date - 2020-03-24T10:22:53+05:30 IST