ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కరోనా కేసులు: ఎంపీ

ABN , First Publish Date - 2020-06-23T10:50:33+05:30 IST

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రోజురోజుకూ రాష్ట్రం లో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఎంపీ సోయం బాపూరావు ఆరోపించారు. సోమవారం

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కరోనా కేసులు: ఎంపీ

ఆదిలాబాద్‌టౌన్‌, జూన్‌ 22: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రోజురోజుకూ రాష్ట్రం లో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఎంపీ సోయం బాపూరావు ఆరోపించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని రిమ్స్‌ కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని, అందుకే తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని హైకమాండ్‌ పిలుపునిచ్చిందన్నారు. అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా వైరస్‌ పట్ల మాట్లాడిన తీరు బాధాకరమని ఎద్దేవా చేశారు.


రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పిన గొప్ప గొప్ప మాటలు విడ్డూరమని ఆరోపించారు. దేశవ్యాప్తంగా వైరస్‌ నివారణకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్లక్ష్యంతోనే కేసులు పెరిగిపోతున్నాయన్నారు. జిల్లాలోనూ చాలా రోజుల తర్వాత కొత్తగా కేసు నమోదైందని, ఈ కేసుతో వందల మందికి కరోనా సోకిందేమోనన్న అనుమానాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నార న్నారు.


రిమ్స్‌ డైరెక్టర్‌ బలిరాంరాథోడ్‌ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో ఇప్పటి వరకు రిమ్స్‌లో 568 స్యాంపుల్స్‌ను తీసుకొని టెస్టులు నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో 62 మందికి పాజిటివ్‌ ఉన్నట్లు తే లిందని తెలిపారు. వీరికి ప్రత్యేకంగా చికిత్సను అందించేందుకు వైద్యులు సి ద్ధంగా ఉన్నారని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు పంపడం జరి గిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాంపెల్లి వేణుగోపాల్‌, ఆధినాథ్‌, దారు ట్ల జీవన్‌, జోగురవి, సోమరవి, ప్రవీణ్‌రెడ్డి, జ్యోతి పాల్గొన్నారు.

Updated Date - 2020-06-23T10:50:33+05:30 IST