వామ్మో కరోనా
ABN , First Publish Date - 2020-07-19T06:55:34+05:30 IST
జిల్లాలో కరోనా మహమ్మారి ఠారెత్తిస్తోంది. శనివా రం 29 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో...

- తాజాగా 29 పాజిటివ్
- జిల్లాలో 262 కేసులు
- నస్పూర్‌లో మహిళ మృతి
- నాలుగుకు చేరిన మరణాలు
-
(ఆంధ్రజ్యోతి, మంచిర్యాల)
జిల్లాలో కరోనా మహమ్మారి ఠారెత్తిస్తోంది. శనివా రం 29 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 262కు చేరింది. శనివారం నస్పూర్‌లో మహిళ మృతి చెందింది. జిల్లా లో మొత్తం నాలుగు మరణాలు నమోదయ్యాయి. 522 నమూనాలను పంపగా 316 నెగెటివ్ వచ్చాయి. రెండు ఫలితాలు రావాల్సి ఉంది. 112 యాక్టివ్ కేసు లుండగా, 149 మంది డిశ్చార్జి అయ్యారు. శనివారం వచ్చిన 29 కేసులలో నస్పూర్‌లో నాలుగు, మంద మర్రి, చెన్నూర్, జైపూర్, కాసిపేటలో ఒక్కొక్కటి, లక్షెట్టిపేటలో రెండు, మంచిర్యాలలో 10, బెల్లంపల్లిలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. చెన్నూర్‌లో ఒక పోలీసు అధికారికి కూడా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మంచిర్యాలలో ఇప్పటికే 60కి పైగా, బెల్లం పల్లిలో 70 వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బెల్లం పల్లి, మంచిర్యాల, నస్పూర్, మందమర్రి మండ లాలలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి.
నస్పూర్‌లో...
నస్పూర్ మున్సిపాలిటీలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. నస్పూర్‌కు చెందిన మహిళ (25) కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందు తూ శుక్రవారం మృతి చెందింది. అర్ధరాత్రి మృతదేహ న్ని నస్పూర్‌కు తరలించారు. వైద్య, మున్సిపల్, పోలీ స్, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో కొవిడ్ నిబం ధనల ప్రకారం దహన సంస్కారాలు చేశారు. మహిళ నివాసం ఉన్న ప్రాంతాన్ని శనివారం జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ బాలాజీ, సీఐ కుమారస్వామి, ఎస్సై ప్రమోద్‌రెడ్డిలు సందర్శించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. వారం రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రావద్దని కుటుంబ సభ్యులకు సూచించారు. వైద్య సిబ్బంది 15 మందిని గుర్తించి వారి నమూనాలను పంపించారు. అప్రమత్తంగా ఉం డాలని, ప్రభుత్వ సూచనలను కచ్చితంగా పాటించాల ని అధికారుల పేర్కొన్నారు. శనివారం నస్పూర్, తీగల్‌పహాడ్, షిర్కే కాలనీ, క్రిష్ణ కాలనీలకు చెందిన నలుగురికి కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు ప్రకటించారు.
శ్రీరాంపూర్‌లో
శ్రీరాంపూర్ కృష్ణా కాలనీలో ఒకరికి కరో నా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. వారం రోజుల క్రితం వంటమనిషి అస్వస్థతకు గురయ్యాడు. మూడు రోజుల క్రితం కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. శనివారం అతనికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లు సమాచారం. వెంటనే అతన్ని వైద్యా ధికారులు బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రానికి పంపించారు. పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనిత ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది కాలనీని సందర్శించి క్లోరినేషన్, శానిటైజే షన్ చేయించి కట్టడి ప్రాంతంగా ప్రకటించారు.
చెన్నూర్‌లో...
చెన్నూర్ పోలీస్‌స్టేషన్‌లో మరో పోలీస్ అధి కారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ప్రజలతో పాటు, పోలీసులు భయాందోళనకు గురవుతున్నారు. రెండు రోజుల క్రితం బ్లూకోట్ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ రావడంతో అతనితో కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్ చేశారు. శనివారం విడుదల చేసిన హెల్త్ బుల్‌టిన్‌లో పోలీస్ అధికారికి సైతం పాజిటివ్ రాగా అతనిని హోంక్వారంటైన్ చేశారు. దీంతో చెన్నూర్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండుకు చేరింది. అధికారికి పాజిటివ్ రావడంతో సిబ్బందితోపాటు వివిధ కేసుల నిమిత్తం అతనిని కలిసిన వారు ఆందోళనకు గురవుతున్నారు.
బెల్లంపల్లిలో
బెల్లంపల్లి పట్టణంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. పట్ట ణంలో శనివారం కేసుల సంఖ్య 47కు పెరిగింది. కుమ్రరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఖైరి గూడా ఓపెన్ కాస్టులో పని చేస్తున్న కార్మికుల్లో ఏడు గురికి పాజిటివ్ రాగా వారంతా బెల్లంపల్లి పట్టణానికి చెందిన వారుగా నిర్ధారించారు. తాజాగా మహ్మద్ ఖాసీం బస్తీకి చెందిన ఓ మహిళకు పాజిటివ్ వచ్చింది. ఖైరి గూడా ఓపెన్ కాస్టులో పని చేస్తూ పాజిటివ్ వచ్చిన ఏడుగురు కార్మికులు హనుమాన్ బస్తీ, స్టేషన్ రోడ్డు కాలనీ, గోల్ బంగ్లా బస్తీలకు చెందిన వారు కావడంతో ఆ కాలనీలలో పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ నరేష్ గుప్తా, 1వటౌన్ ఇన్స్‌పెక్టర్ బి. రాజు ఆధ్వర్యంలో భారీకేడ్లు ఏర్పాటు చేశారు. మున్పిపాలిటీ ఆధ్వర్యంలో హై పో క్లోరైడ్ ద్రావణం పిచికారి చేశారు.
కాసిపేటలో...
ధర్మారావుపేటలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ధర్మారావుపేటకు చెందిన చెందిన కరోనా పాజిటివ్ ఉన్న బంధువులను చూడడానికి వెళ్లిన నేపథ్యంలో ఆమెకు పాజిటివ్ వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు.
మహిళా ఉద్యోగికి కరోనా పాజిటివ్
లక్షెట్టపేట పట్టణానికి చెందిన మహిళా ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఉద్యోగి ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ శాఖకు సంబంధిం చిన కార్యాలయంలో కీలకమైన బాధ్యతలను చేపడుతోం దని, మూడు రోజుల క్రితం ఆమెకు జ్వరం రాగా లక్షె ట్టిపేట ప్రభుత్వాసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకుంద న్నారు. ఆమెకున్న లక్షణాలను బట్టి బెల్లంపల్లి ఐసోలేష న్‌కు మూడు రోజుల క్రితం తరలించారు. శనివారం జరిపిన పరీక్షలో సదరు ఉద్యోగినికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. లక్షెట్టిపేటలో ఉంటున్న ఆమె భర్త, కుమార్తెను ప్రైమరీ కాంటాక్ట్ కింద హోం క్వారంటైన్ చేశారు.
ఆటో డ్రైవర్‌కు కరోనా
శెట్‌పల్లి గ్రామానికి చెందిన ఓ ఆటో డ్రైవ ర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా సర్వేకల్ అధికారి డాక్టర్ బాలాజీ తెలిపారు. వారం నుంచి అస్వస్థతకు గురి కావడంతో నాలుగు రోజుల క్రితం బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రానికి వెళ్లి రక్త నమూనాలు ఇచ్చాడు. శనివారం పాజిటివ్ నిర్థారణ అయినట్లు డాక్ట ర్లు సమాచారం అందించడంతో కుందారం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రజిని, ఏఎన్‌ఎం స్వరూప, పోలీస్ సిబ్బం ది ఆటో డ్రైవర్‌ను బెల్లంపల్లి ఐసోలేషన్‌కు తరలించి కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి బయటకు రావద్దని సూచించారు.