జిల్లాలో మరో 12 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-12-06T07:03:13+05:30 IST

ఆదిలాబాద్‌ జిల్లాలో 12 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. శనివారం 1928మంది నుంచి షాంపిల్స్‌ తీసుకోగా, 1921 మందికి నెగెటివ్‌ రాగా 12 మందికి కరోనా వచ్చినట్లు తెలిపారు.

జిల్లాలో మరో 12 కరోనా కేసులు

ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 5: ఆదిలాబాద్‌ జిల్లాలో 12 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. శనివారం 1928మంది నుంచి షాంపిల్స్‌ తీసుకోగా, 1921 మందికి నెగెటివ్‌ రాగా 12 మందికి కరోనా వచ్చినట్లు తెలిపారు. మరో ఐదు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. హోం ఐసోలేషన్‌లో 201 మంది, రిమ్స్‌లో 6, మొత్తం 207 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్‌ వ్యాప్తిని రూపుమాపవచ్చని సూచించారు.

Read more