పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు కృషిచేయాలి

ABN , First Publish Date - 2020-12-07T04:01:52+05:30 IST

యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు పార్టీ అభివృ ద్ధికి సైనికుల్లా కృషి చేయాలని టీపీసీసీ లీగల్‌ సెల్‌ వైస్‌ చైర్మన్‌ కాంపెల్లి ఉద య్‌కాంత్‌ పిలుపునిచ్చారు.

పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు కృషిచేయాలి
మహేందర్‌ను సన్మానిస్తున్న టీపీసీసీ లీగల్‌ సెల్‌ వైస్‌ చైర్మన్‌ ఉదయ్‌కాంత్‌

టీపీసీసీ వైస్‌ చైర్మన్‌ కాంపెల్లి ఉదయ్‌కాంత్‌  

బెల్లంపల్లి టౌన్‌, డిసెంబరు 6: యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు పార్టీ అభివృ ద్ధికి సైనికుల్లా కృషి చేయాలని టీపీసీసీ లీగల్‌ సెల్‌ వైస్‌ చైర్మన్‌ కాంపెల్లి ఉద య్‌కాంత్‌ పిలుపునిచ్చారు. బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ యువజన  కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా గెలుపొందిన మహేందర్‌ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఉదయ్‌కాంత్‌, బండి ప్రభాకర్‌యాదవ్‌, తొంగల మల్లేష్‌లు మహేందర్‌ను సన్మా నించారు. ఉదయ్‌కాంత్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం తిరోగమన దిశలో పనిచేస్తుందని, ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ మెజా రిటీ సీట్లు గెలుచుకోలేకపోయిందని విమర్శించారు. మహేందర్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి పోరాటం చేపడతానని తెలిపారు. కార్యక్రమంలో విజయ్‌కుమార్‌, ఎండి ఈషా, బండి రాము, చంద్రమౌళి, శ్రీనివాస్‌, మొండి, ఎనగందుల వెంకటేష్‌, కంకటి శ్రీనివాస్‌, హరీష్‌ పాల్గొన్నారు.  

Read more