నిబంధనలు పాటించాలి: ఆర్డీవో

ABN , First Publish Date - 2020-05-13T07:09:18+05:30 IST

ఆటో డ్రైవర్లు లాక్‌డౌన్‌ నిబంధన లు పాటించాలని ఉట్నూర్‌ ఆర్డీవో వినోద్‌కుమార్‌ అన్నా రు.

నిబంధనలు పాటించాలి: ఆర్డీవో

ఉట్నూర్‌, మే 12: ఆటో డ్రైవర్లు లాక్‌డౌన్‌ నిబంధన లు పాటించాలని ఉట్నూర్‌ ఆర్డీవో వినోద్‌కుమార్‌ అన్నా రు. మంగళవారం ఇంద్రవెల్లి తహసీల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైర స్‌ వ్యాపించకుండా ప్రతీ ఆటోలో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం పాటించేలా చూడాలని తెలిపారు. ఆటో డ్రైవర్లు సైతం తమ వంతు బాధ్యతగా అవగాహన కల్పించాలన్నారు. ఆటోలు నడిపించాలని అనుకునే వారు ఎస్సై నుంచి అనుమతులు పొందాలన్నారు. ఈ సమావేశంలో గిర్దావర్‌ లక్ష్మణ్‌, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Read more