మిడతల నివారణ కోసం కమిటీలు ఏర్పాటు చేయాలి : ఏడీ
ABN , First Publish Date - 2020-06-23T10:53:01+05:30 IST
పంటలను నాశనం చేసే మి డతల నివారణ కోసం గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ ఏడీ రమేష్ తెలిపారు.

తలమడుగు, జూన్ 22: పంటలను నాశనం చేసే మి డతల నివారణ కోసం గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ ఏడీ రమేష్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో మిడతల దండు సమాచారం వస్తుందని, వాటి నివారణ కోసం రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులతో కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏఈవోలు గ్రామాల్లోకి వెళ్లి రైతులకు పంటలపై అవగాహన కల్పించాలన్నారు. రైతుబంధు, రైతుబీమారాని రైతులకు అందే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి శివకు మార్, ఏవో మహేందర్, తదితరులు పాల్గొన్నారు.