కరోనా కట్టడికి చర్యలు : కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

ABN , First Publish Date - 2020-09-12T10:59:26+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు.

కరోనా కట్టడికి చర్యలు : కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 11: జిల్లాలో కరోనా వైరస్‌ కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆసిఫాబాద్‌ సీహెచ్‌సీలో 54, వాంకిడి క్వారంటైన్‌లో 48, సింగరేణి గోలేటి ఐసోలేషన్‌లో 41, సాంఘిక గురుకుల పాఠశాలలో 34, కాగజ్‌నగర్‌ పోస్టు మెట్రిక్‌ గర్ల్స్‌లో 33 మొత్తం 210 మంది కోవిడ్‌ అనుమానితులు ఉన్నారని తెలిపారు.


ఇప్పట వరకు జిల్లాలో 17,355 మంది శాంపిల్స్‌ని గాంధీ ఆసుపత్రికి పంపించామని చెప్పారు. అందులో 1,289 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. 15,984 మందికి నెగిటివ్‌ వచ్చిందని, 82 మంది రిజల్ట్‌ రావాల్సి ఉందని తెలిపారు. సమావేశంలో అదనపు జిల్లా కలెక్టర్‌ రాంబాబు, జిల్లా రెవెన్యూ అధికారి సురేష్‌, జిల్లా వైద్యాధికారి కుంరం బాలు, ఎస్సై అనీల్‌కుమార్‌, సూపరింటెండెంట్‌ స్వామి, కోవిడ్‌ టెస్ట్‌ ఇన్‌చార్జి కాత్యాయిని తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-12T10:59:26+05:30 IST