నచ్చన్‌ ఎల్లాపూర్‌ గురుకులంను తనిఖీ చేసిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-12-12T05:16:36+05:30 IST

కడెం మండలంలోని నచ్చన్‌ ఎల్లాపూర్‌ గ్రామంలోని సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే తనిఖీ చేశారు.

నచ్చన్‌ ఎల్లాపూర్‌ గురుకులంను తనిఖీ చేసిన కలెక్టర్‌
బోధన పద్ధతులను అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

కడెం, డిసెంబరు 11 : కడెం మండలంలోని నచ్చన్‌ ఎల్లాపూర్‌ గ్రామంలోని సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు జరుగుతున్న ప్రాక్టికల్‌ తరగతులను పరిశీలించారు. ల్యాబ్‌లో విద్యార్థులతో ప్రయోగాలు చేయించి ఫలితాలు అడిగి తెలుసుకున్నారు. బోధన పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బొడ్డు గంగన్న, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ శ్రీనివాస్‌, ఎంపీవో శ్రీనివాస్‌, కార్యదర్శి రమాదేవి, వైస్‌ ప్రిన్సిపాల్‌ రాధిక, మీనా, కళాశాల స్టాప్‌, కారోబార్‌ మహేందర్‌, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T05:16:36+05:30 IST