పల్లెప్రగతి పనులతో రూపురేఖలు మారాలి

ABN , First Publish Date - 2020-06-21T10:38:19+05:30 IST

గ్రామాల అభివృద్ధి, ప్రజ ల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం పల్లెప్రగతిలో భాగంగా గ్రామ పంచాయతీలకు ప్రతీనెలా రూ.8 కోట్లను

పల్లెప్రగతి పనులతో రూపురేఖలు మారాలి

కలెక్టర్‌ భారతి హొళికేరి 


మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 20: గ్రామాల అభివృద్ధి, ప్రజ ల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం పల్లెప్రగతిలో భాగంగా గ్రామ పంచాయతీలకు ప్రతీనెలా రూ.8 కోట్లను కేటాయిస్తోందని,  అధికారులు సమన్వయంతో నిధులు వినియో గిస్తూ జిల్లా రూపురేఖలు మార్చాలని కలెక్టర్‌ భారతిహోళికేరి పేర్కొన్నారు. శనివారం అద నపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో కలిసి వీడియో కా న్ఫరెన్స్‌ ద్వారా ఎంపీడీవోలు, పంచాయతీ అధికారులు, కార్యద ర్శులు, ఏపీఓలతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన పారిశుధ్య సిబ్బంది నియామకం జరిగిందని, పూర్తిస్థాయిలో అధికారులు, వన రులు అందుబాటులో ఉన్నందున అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. పంచాయతీలకు ట్రాక్ట ర్లు, ట్రాలీలు కొనుగోలు చేశామని, గ్రామ పంచాయతీలు ఈఎంఐలు చెల్లించాలన్నారు. పారిశుధ్య పనులపై రోజూ నివేదిక పంపిం చాలని ఆదేశించారు. రూ.5 లక్షలలోపు ఆదాయం గల గ్రామా ల వివరాలు అందించాలన్నారు. జడ్పీ సీఈఓ నరేందర్‌, డీఆర్‌ డీఓ బి.శేషాద్రి, డీపీఓ వీరబుచ్చయ్య,  ఈఈ ప్రకాష్‌, డీఎల్‌పీఓలు అధికారులు పాల్గొన్నారు. 


రైతుల ప్రయోజనం కోసమే జలహిత పనులు 

లక్షెట్టిపేట రూరల్‌: కడెం ప్రాజెక్టు నుంచి చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగు నీరందించేలా జలహిత కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్‌ భారతి హొళికేరి పేర్కొన్నారు. జెండా వెం కటాపూర్‌లో శనివారం 38 డిస్ట్రిబ్యూటరీ వద్ద జలహిత కార్యక్ర మాన్ని ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా ప్రయోజనం చేకూరుస్తోం దన్నారు. గతంలో కాల్వల మరమ్మతులు ఇరిగేషన్‌ శాఖ ద్వారా నిర్వహించేవారన్నా రు. ప్రస్తుతం ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ శాఖకు అప్పగిం చడం వల్ల పూర్తి మరమ్మతులు అయ్యే అవకాశం ఉందన్నారు. మండల ప్రత్యేకాధికారి వినోద్‌కుమార్‌, జడ్పీటీసీ సత్తయ్య ఎంపీపీ మం గచిన్నయ్య, డీసీఎంఎస్‌ చైర్మన్‌లింగయ్య, ఎంపీడీఓ సత్యనారా యణ, చైర్మన్‌కాంతయ్య, వైస్‌చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. 


నర్సరీలపై నిర్లక్ష్యం వహిస్తే  చర్యలు

తాండూర్‌(బెల్లంపల్లి):  నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని కలెక్టర్‌ హెచ్చరించారు. శని వారం బోయపల్లి పంచాయతీ పరిధిలోని నర్సరీని తనిఖీ చేశారు. నర్సరీలో పిచ్చి మొక్కలు పెరిగి ఉండడంతో సర్పంచు సునీత, కార్యదర్శిపై అసహనం వ్యక్తం చేశారు.  హరితహారాన్ని విజయవంతం చేసేందుకు ప్రజాప్ర తినిధులు, అధికారులు కృషి చేయాలన్నారు. శ్మశాన వాటిక నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. చౌటపల్లిలోని నర్సరీని కలెక్టర్‌ పరిశీలిం చారు. ఎంపీడీవో శశికళ, సర్పంచు శంకర్‌ పాల్గొన్నారు. 


మార్కెట్‌ ఫీజు విడుదల

మంచిర్యాల కలెక్టరేట్‌: జిల్లాలో 2018-19 సంవత్సరానిగాను వర్షాకాలం, యాసంగికి సంబంధించిన ధాన్యం కొనుగోలుకు చె ల్లించాల్సిన మార్కెట్‌ ఫీజు రూ.3కోట్ల 94లక్షల చెక్కును శని వారం విడుదల చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ వై.సురేంద ర్‌రావు తెలిపారు. సంబంధిత చెక్కును జిల్లా మార్కెటింగ్‌ అధికారి గజానంద్‌కు అందించి రాబోయే కొనుగోలు సీజన్‌లో కావాల్సిన టార్పాలిన్లు, వేయింగ్‌ యంత్రాలు, తేమ కొలిచే యంత్రాలకు నిధులు వినియోగించాలన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని, 32,424 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటి వరకు 19,865 మంది రైతులకు సంబంధించి నగదు వారి ఖాతాలలో జమ చేశామని, మిగతా వారికి మూడు రోజుల్లో చెల్లించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా పౌరసరఫరాల అధికారి వెం కటేశ్వర్లు, జిల్లా మేనేజర్‌ గోపాల్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-21T10:38:19+05:30 IST