వసూళ్ల దందా!

ABN , First Publish Date - 2020-09-06T09:09:19+05:30 IST

ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న ఇళ్ల కేటాయింపులో కొందరు నేతలు వసూలు దందాకు దిగినట్లు ఆరోపణ లున్నాయి...

వసూళ్ల దందా!

జిల్లాలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కేటాయింపు కోసం రూ.50 వేల వరకు వసూలు

బోథ్‌ నియోజకవర్గంలో అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న అధికారులు

ప్రారంభానికి ముందే కబ్జా చేస్తున్న అక్రమార్కులు

ప్రారంభం కాని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ

జిల్లాలో పూర్తయినవి 455 ఇళ్ల నిర్మాణాలు

దసరాకు కేటాయింపులు అనుమానమే


ఆదిలాబాద్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాతో పాటు పలు మండలాల్లో అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న ఇళ్ల కేటాయింపులో కొందరు నేతలు వసూలు దందాకు దిగినట్లు ఆరోపణ లున్నాయి. ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.50 వేల వరకు అక్రమార్కు లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. బోథ్‌ నియోజకవర్గంలో అయి తే బహిరంగంగానే డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులకు తెలి సినా చర్యలు తీసుకునేందుకు వెనకడుతున్నారనే ఆరోపణలున్నాయి.


అందుబాటులో ఉన్నవి తక్కువ.. డిమాండ్‌ ఎక్కువ..

జిల్లాలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయి ఏడాది గడు స్తున్నా ప్రారంభానికి మాత్రం నోచుకోవడం లేదు. వీటి కేటాయింపుల పై అధికార పార్టీ నేతలు డైలమాలో పడుతున్నారు. ఇప్పటి వరకు వందల సంఖ్యలో నిర్మాణాలు పూర్తికాగా, వేల సంఖ్యలో లబ్ధిదారులు ఉన్నారు. దీంతో ఎవరికీ కేటా యించినా వ్యతిరేకత తప్పదన్న భావనతో అధికార పార్టీ నేత లు కనిపిస్తున్నారు. ఇన్నాళ్లు నిర్మాణాలపై ఉరుకులు పరుగులు పెట్టిం చిన అధికార పార్టీ నేతలే ఇప్పుడు మౌనంగా ఉండి పోవడం ఏమిట న్న ప్రశ్నలు అధికార వర్గాలతో పాటు ప్రజల్లో వ్యక్తమ వుతున్నాయి. రెండేళ్లుగా దసరా పండుగ కానుకగా ఇళ్లు అందజేస్తామ ని ప్రభుత్వ పెద్దలు, జిల్లా నేతలు చెప్పుకొస్తున్నా ఆచరణ సాధ్యం మాత్రం కావ డం లేదు. నాలుగేళ్లలో జిల్లాకు 3346 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 455 నిర్మాణాలు పూర్తయ్యాయి. నాలుగేళ్లుగా నిర్మాణాలు నత్త నడకనే కొనసాగడంతో లక్ష్యం నెరవేరడం లేదు. దీంతో హడావిడిగా పనులు పూర్తి చేయడంతో నాణ్యతలోనూ డొల్లతనం కనిపిస్తోంది. కొ న్నేళ్లుగా ఇదిగో అదిగో అంటూ ఊరిస్తూ వస్తున్న నేతలు లబ్ధిదారుల కు ఇళ్లు ఎప్పుడు కేటాయిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏ డాది దసరా పండుగ దగ్గర పడుతున్న ఇప్పటి వరకు ఎలాంటి హడా విడి లేకపోవడంతో కేటాయింపులపై అనుమానాలే వ్య క్తమవుతున్నా యి. దీంతో లబ్ధిదారుల్లో తీవ్ర నిరాశను నింపుతోంది. 


పూర్తయినవి తక్కువ..

జిల్లాకు ప్రభుత్వం 3,346 ఇళ్లు మంజూరు చేయగా, ఆగస్టు వరకు 455 నిర్మాణాలు పూర్తయ్యాయి. జిల్లాలో పేదలు అధికంగా ఉండడం తో కేటాయింపు సమస్యగా మారుతోంది. స్థానిక నేతల నుంచి ఒత్తిళ్లు పెరిగిపోవడంతో కేటాయింపులు వాయిదా పడుతున్నట్లు అధికార పా ర్టీ నేతలు చెబుతున్నారు. జిల్లాలో 4వేల నుంచి 5 వేల వరకు నిర్మా ణాలు పూర్తయితేనే కొంతమేరకు ఒత్తిడి తగ్గే అవకాశం కనిపిస్తోంది. మావల, ఉట్నూర్‌, జైనథ్‌ మండలాలతో పాటు కేఆర్‌కే కాలనీలో నిర్మా ణాలు పూర్తయినా కేటాయుంచే పరిస్థితులు కని పించడం లేదు. 


ప్రారంభానికి ముందే కబ్జా..

జిల్లాలో నిర్మాణం పూర్తయిన ఇళ్లను కొందరు లబ్ధిదారులు ప్రారంభానికి ముందే కబ్జా చేస్తున్నా రు. ఏడాది పాటుగా ఎదురు చూసిన అధికారులు కేటాయించకపోవడంతో స్థానిక నేతల అండతో కబ్జా చేసి నివాసం ఉంటున్నారు. అయినా సంబం ధిత అధికారులు నోరు మెదుపక పోవడంపై అను మానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్థానిక నే తలు ఇళ్లను కబ్జా చేస్తూ పేద ప్రజలకు అంటగ డుతున్నారు. అందినకాడికి దండుకుంటూ అధికా రుల వద్ద చక్రం తిప్పుతున్నారు. స్థానిక నేతల ఒ త్తిళ్లు పెరిగిపోవ డంతో అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. 


లబ్ధిదారుడి నుంచి రూ.50వేలు వసూలు..

అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న ఇళ్లల్లో కొందరు నేతలు వసూళ్ల దందాకు దిగినట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నట్లు లబ్ధిదారులు వాపోతున్నారు. డబ్బులు ఇస్తేనే ఇ ళ్లు కేటాయిస్తామని నమ్మబలకడంతో అమాయక ప్రజలు అప్పుసప్పు చేసి ముట్ట చెబుతున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్న ని యోజకవర్గస్థాయి నేతలు నోరు మెదుపడం లేదు. తమ అనుచరుల వసూలు దందాపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా ఇదంతా మాములే నంటూ తేలికగా తీసుకుంటున్నారు. బోథ్‌ మండలంలో ఓ అధికార పార్టీ నేత లబ్ధిదారుల నుంచి బహి రంగంగానే వసూలు చేస్తున్నట్లు ఆ మండల ఎంపీపీ తుల శ్రీనివాస్‌ జడ్పీ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకొ చ్చినా చర్యలు తీసుకోవడం లేదు.


మూడేళ్లుగా ఎదురు చూపులే..

మూడేళ్లుగా పేదలను ఊరిస్తూ వస్తున్న సొంతింటి కల నెరవేరడం లేదు. ఇన్నాళ్లు ఇదిగో అదిగో అంటూ హామీలు ఇస్తూ వచ్చిన నేతలం తా ప్రస్తుతం మౌనంగానే ఉండిపోతున్నారు.  ఇప్పటికే కొన్ని మండ లాల్లో పేదల నుంచి దరఖాస్తులు తీసుకున్న అధికారులు జాబితాను సిద్ధం చేసి నేతల ఆమోదం కోసం వేచి చూస్తున్నారు. ఇళ్ల కోసం కు ప్పలు తెప్పలుగా దరఖాస్తులు రావడంతో ఎవరికీ కేటాయించాలో అర్థం కాక ఎంపిక జాబితాను పక్కన పెట్టారు. దీనికి తోడు లక్కీ డ్రా విధానం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలన్న నిబంధనతో నేత లు వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. ఇది వరకే హామీ ఇ చ్చిన లబ్ధిదారులకు ఎలా అందించాలన్న ఆలోచనలో పడ్డారు. కొన్ని ఇ ళ్లు తమ అనుచరులకు దక్కేలా నిబంధనలు సడలించాలని ముఖ్య మంత్రి కేసీఆర్‌ వద్ద జిల్లా నేతలంతా మొర పెట్టుకున్నట్లు తెలుస్తోం ది. దీంతో ప్రభుత్వం నుంచి సడలింపులతో కూడిన నిబంధనలు వస్తా యని నేతలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. 


ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తున్నాం..

జిల్లాలో మరిన్ని ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు 455 నిర్మాణాలు పూర్తయ్యాయి. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తికా గానే అందజేస్తాం. ఈ ప్రక్రియ రెవెన్యూ అధికారులు చేపట్టాల్సి ఉం టుంది. దసరా వరకు పూర్తయిన ఇళ్లను అందజేసే అవకాశం ఉంది. - 

- సి.బసవేశ్వర్‌ (జిల్లా గృహ నిర్మాణ శాఖ నోడల్‌ అధికారి, ఆదిలాబాద్‌)


Updated Date - 2020-09-06T09:09:19+05:30 IST