చలి చలిగా..

ABN , First Publish Date - 2020-11-28T04:37:41+05:30 IST

రాష్ట్రంలోనే కనిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాలో చలి వణుకు పుట్టిస్తోంది. నివార్‌ తుఫాన్‌ ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై తీవ్రమైన చలి, ఈదురు గాలులు వీస్తున్నాయి.

చలి చలిగా..
సీతాగొందీ వద్ద మంచులో వస్తున్న వాహనాలు

జిల్లాపై నివార్‌ తుఫాన్‌ ప్రభావం

పగలు సైతం వెచ్చని దుస్తులు ధరిస్తున్న ప్రజలు

పత్తి పంటను కాపాడుకునేందుకు రైతుల పాట్లు

ఆదిలాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే కనిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాలో చలి వణుకు పుట్టిస్తోంది. నివార్‌ తుఫాన్‌ ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై తీవ్రమైన చలి, ఈదురు గాలులు వీస్తున్నాయి. జిల్లాలో అక్కడక్కడ చిరు జల్లులు కురుస్తున్నాయి. తీవ్రమైన చలికి నివార్‌ తుఫాన్‌ తోడు కావడంతో పగలంతా ప్రజలు వెచ్చని దుస్తులను ధరించి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు వచ్చేపరిస్థితులు లేక పోవడంతో ఇంటికే పరిమితమవుతున్నారు. చలి తీవ్రతతో ప్రజలు పట్ట పగలే చలి మంటలు వేసుకుంటున్నారు. జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 27.8 నమోదు కాగా, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18.6డిగ్రీలుగా నమోదయ్యాయి. కదులుతున్న మేఘాలు, అక్కడ క్కడ కురుస్తున్న చిరుజల్లులతో చేతికొచ్చిన పత్తి పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు.ఇప్పటికే చేతికొచ్చిన పత్తి పంటను మార్కెట్‌కు తరలించే అవకాశం లేక ఇళ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు. 

Read more