ప్రశాంతంగా ముగిసిన ఇంటర్‌ పరీక్షలు.

ABN , First Publish Date - 2020-03-19T12:28:04+05:30 IST

మంచిర్యాల జిల్లాలో ఇంటర్మీడియెట్‌ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి.

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్‌ పరీక్షలు.

 ఆనందోత్సహాలతో విద్యార్థులు ఇంటికి పయనం 

 19, 20 తేదీల్లో ముగియనున్న ఒకేషనల్‌ పరీక్షలు


శ్రీరాంపూర్‌, మార్చి 18: మంచిర్యాల జిల్లాలో ఇంటర్మీడియెట్‌ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం మొదటి సంవత్సరం విద్యార్థులకు, బుధవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ముగిశాయి. జిల్లాలోని 26 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్‌ ప్రఽథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన విద్యార్థులు 16,237 మంది పరీక్షలు రాశారు. ఈ విద్యా సంవత్సరం పరీక్షల నిర్వహణ హై పవర్‌ కమిటీ చైర్మన్‌ జిల్లా కలెక్టర్‌ భారతీహోళికేరి ఆధ్వర్యంలో సభ్యులుగా డీసీపీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి, డీఐఈవో వి. ఇంద్రాణి, ఆర్‌జేడీ వెంక్యానాయక్‌, ఎలీషా దేవి, అంజయ్యల మార్గదర్శనంలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు.


ఈ సంవత్సరం ఒక్క విద్యార్థి కూడా డీబార్‌ కాలేదు. పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో విద్యార్థులు బుధవారం పరీక్ష కేంద్రాల నుంచి ఉల్లాసంగా తమ తోటి స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఇండ్లకు పయనమయ్యారు. ఒకేషనల్‌ కోర్సుల పరీక్షలు ఈ నెల 19, 20 తే దీల్లో పూర్తి చేయనున్నారు. ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు గత ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు నిర్వహించారు. 


ఆన్‌లైన్‌ విధానం ద్వారా ఎంసెట్‌ శిక్షణ తరగతులు:డీఐఈవో వి. ఇంద్రాణి 

జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు (జనరల్‌) పకడ్బందీగా నిర్వహించాం. మంచిర్యాలలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియెట్‌ ద్వారా ఆన్‌లైన్‌ విధానం ద్వారా ఎంసెట్‌కు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. నూతన విద్యా సంవత్సరంలోను ఆన్‌లైన్‌ ద్వారానే విద్యార్థులకు అడ్మిషన్లు జరుగుతాయి. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి మార్గదర్శనం చేసిన జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరి, అధికారులందరికీ ధన్యవాదాలు. 

Updated Date - 2020-03-19T12:28:04+05:30 IST