అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టును తనిఖీ

ABN , First Publish Date - 2020-05-17T09:41:32+05:30 IST

బాసర మండలం బిద్రెల్లి వద్దగల మహారాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టును శనివారం జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌అలీఫారూఖి తనిఖీ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి

అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టును తనిఖీ

బాసర,  మే 16 : బాసర మండలం బిద్రెల్లి వద్దగల మహారాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టును శనివారం జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌అలీఫారూఖి తనిఖీ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో చేపడుతున్న తనిఖీలు, వైద్య పరీక్షల గురించి ఆరా తీశారు. నిత్యం ఎంత మంది ఇక్కడి నుంచి అటు, అటు వైపు నుంచి మన రాష్ట్రం వస్తున్నారు, వారి గురించి వివరాలను అడిగి తెలుసు కున్నారు.


అక్కడి నుండి మండల కేంద్రంలో ధాన్యం నిల్వ చేస్తున్న ఽఫంక్షన్‌హాల్‌ను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. రైతులు పండించిన పంటను కొను గోలు చేసే ప్రక్రియను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూ చించారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో రాజు, ముథోల్‌ సీఐ అజయ్‌బాబు తదితరులున్నారు. 

Updated Date - 2020-05-17T09:41:32+05:30 IST