ఇంటర్‌ పరీక్ష కేంద్రం తనిఖీ

ABN , First Publish Date - 2020-03-15T12:49:53+05:30 IST

మండల కేంద్రంలోని ఇంటర్‌ పరీక్ష కేంద్రం లో శనివారం పకడ్బందీగా తనిఖీలు చేపట్టారు.

ఇంటర్‌ పరీక్ష కేంద్రం తనిఖీ

దిలావర్‌పూర్‌, మార్చి 14 : మండల కేంద్రంలోని ఇంటర్‌ పరీక్ష కేంద్రం లో శనివారం పకడ్బందీగా తనిఖీలు చేపట్టారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం భౌతిక శాస్త్రం, అర్థశాస్త్రం పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కేంద్రం బయట విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే కేంద్రంలోకి అనుమతించారు. శనివారం జరిగిన పరీక్షకు జనరల్‌ విభాగంలో 275 మంది విద్యార్థులు హాజరు కాగా ముగ్గురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విభాగంలో 53 మంది విద్యార్థులు హాజరు కాగా ఒక విద్యార్థి గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రం చీప్‌ సూపరింటెండెంట్‌ మురళి, డిపార్ట్‌మెంటల్‌ అధికారి భోజన్న, సిట్టింగ్‌ స్క్వాడ్‌ వెంకటేశ్వర్లు, పరీక్ష గదుల్లో పర్యవేక్షణ చేశారు. 

Updated Date - 2020-03-15T12:49:53+05:30 IST