కల్లూర్‌లో ప్రారంభమైన చంఢీయాగం
ABN , First Publish Date - 2020-12-28T06:09:41+05:30 IST
కల్లూర్ సాయిబాబా ఆలయంలో దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం చంఢీయాగం ప్రారంభమైంది.

కుంటాల, డిసెంబరు 27: కల్లూర్ సాయిబాబా ఆలయంలో దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం చంఢీయాగం ప్రారంభమైంది. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, నవగ్రహపూజ, మండపారాధన, మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతి, దత్తాత్రేయస్వాముల వారికి అభిషేకాలు, అలాగే అగ్నిప్రతిష్ట, మహాత్ముల దివ్య ప్రవచనములు, తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తర్వాత వేద పండితులు చంఢీయాగం ప్రారంభించారు. ఈనెల 20వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు 29న ముగియనున్నాయి. సోమవారం కూడా యజ్ఞం కొనసాగనుంది. ఈ ఉత్సవాలకు భైంసా, దిలావర్‌పూర్, మండలాల నుంచే కాకుండా, నిర్మల్, హైదరాబాద్, మహారాష్ట్ర, ముంబాయి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొంటారు. ఆలయానికి వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నదానం, తాగునీటి సౌకర్యాలను కల్పిస్తున్నారు.