6నుంచి సదరం శిబిరాలు : వైద్యాధికారి

ABN , First Publish Date - 2020-12-28T06:10:38+05:30 IST

జిల్లాలోని దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని నిర్మల్‌ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దేవేందర్‌ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు.

6నుంచి సదరం శిబిరాలు : వైద్యాధికారి

నిర్మల్‌ కల్చరల్‌, డిసెంబరు 27: జిల్లాలోని దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని నిర్మల్‌ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దేవేందర్‌ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. దీనిలో భాగంగా జనవరి 6నుంచి సదరం సర్టిఫికెట్ల కోసం స్లాట్‌ బుకింగ్‌ సోమవారం నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. కొత్తగా పెన్షన్‌ కోసం దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు పొందాలనుకుంటే ఆధార్‌ కార్డు జిరాక్స్‌తో తమ సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఈనెల 28 నుంచి వచ్చే నెల 5వరకు వెళ్లి వైద్యాదికారి సంతకం తీసుకోవాలన్నారు. 6 నుంచి అన్నిరకాల దివ్యాంగులకు సందరం శిబిరాలు ప్రారంభమవుతాయన్నారు. సదరం రెన్యువల్‌ కూడా చేస్తారని వివరించారు. మీసేవ కేంద్రాల ద్వారా వీటిని జారీ చేస్తారని, జిల్లా కేంద్ర ఆస్పత్రిలో శిబిరం నిర్వహిస్తారన్నారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిబిరం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ శిబిరాలను జనవరి 6, 7, 12, 20, 22, 27 తేదీల్లోనూ, ఫిబ్రవరి 3, 10, 12, 17, 19, 24వ తేదీల్లోనూ, మార్చి 10, 13, 19, 24, 31వ తేదీల్లో నిర్వహిస్తారని పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-28T06:10:38+05:30 IST