కేజ్ కల్చర్ విధానం.. మత్స్య కారులకు వరం
ABN , First Publish Date - 2020-03-23T09:40:49+05:30 IST
మత్స్యకారులు ఆర్థిక అభివృద్ధి చెం దడానికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం సాధించడం కోసం ప్రభుత్వం కేజ్ కల్చర్ విధానాన్ని అమలు...

కడెం, మార్చి 22 : మత్స్యకారులు ఆర్థిక అభివృద్ధి చెం దడానికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం సాధించడం కోసం ప్రభుత్వం కేజ్ కల్చర్ విధానాన్ని అమలు చేసింది. మొదటగా రాష్ట్ర ప్రభుత్వం 5 జిల్లాలో ప్రతిష్టాత్మకంగా కేజ్ కల్చర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కడెం ప్రాజెక్టు వద్ద ప్రవేశపెట్టిన కేజ్ కల్చర్ సత్ఫలితాలు సాధించి మత్స్యకారులకు ఉపాధి పొందడంతో కేజ్ కల్చర్ విధానాన్ని విస్తరించేందుకు మత్స్యకారులకు 80 శాతం సబ్సిడీపై యూని ట్‌ను అందజేశారు. కేజ్ కల్చర్ విధానంపై మత్స్యకారులకు అవగాహన కల్పిస్తూ నీలి విప్లవం దిశగా అడుగులు వేస్తున్నారు.
ప్రభుత్వం కడెం ప్రాజెక్టులో చేపట్టిన కేజ్ కల్చర్ విధానం ద్వారా గత ఏడాది 50 వేల చేప పిల్లల పెంపకం చేపట్టగా దీంతో 30 టన్నుల దిగుబడి వచ్చింది. దాదాపు 20 లక్షల ఆదాయం వచ్చింది. ఇందులో పెట్టుబడి పోగా 8 లక్షల రూపాయలు లాభవం వచ్చింది. పది మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికీ ఆరు నెలల్లో 70 వేల రూపాయల ఆదాయం సమకూరింది. దీంతో మత్స్యకారులు కేజ్ కల్చర్ విధానంపై ఆసక్తి చూపుతున్నారు.
తక్కువ విస్తీర్ణం.. ఎక్కువ లాభం..
కేజ్ కల్చర్ విధానంలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ లా భం సాధించే అవకాశం ఉంది. కేవలం పాత పద్ధతిలో చె రువులు కుంటలలో చేప పిల్లల పెంపకం చేపట్టడం ద్వా రా ఆశించిన స్థాయిలో దిగుబడి రాక మత్స్యకారులు నష్టపోయేవారు. దీంతో చెరువుల్లో హెక్టారుకు 80-100 కేజీలు వస్తే కేజ్ కల్చర్ విధానం ద్వారా హెక్టార్‌కు 3-4 టన్నుల దిగుబడి వస్తోంది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి సాధించడమే కే జ్ కల్చర్ లక్ష్యం.
కేజ్ కల్చర్ ద్వారా లక్షల్లో ఆదాయం..
మత్స్యకారులు 10 మంది సభ్యులు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి కేజ్ కల్చర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. 10 మంది స భ్యులు కలిసి ఆరు లక్షల డీడీని చెల్లిస్తే 30 లక్షల విలువ గల కేజ్‌లను అధికారులు మంజూరు చేస్తారు. రిజర్వాయర్‌లో కేజ్‌లను ఏర్పాటు చేస్తారు. ఈ విధానం ద్వారా చే పల పెంపకం చేపడితే లక్షల్లో ఆదాయం వస్తుంది. ప్ర స్తుతం కడెం రిజర్వాయర్‌లో 6 కేజీలను ఏర్పాటు చేసుకొ ని మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు.
కేజ్ కల్చర్‌లో చేపల పెంపకం విధానం..
ఒక కేజ్ కల్చర్ యూనిట్‌లో 10 కేజీలను ఏర్పాటు చే స్తారు. ఒక్కో కేజీలో 3-4 వేల చేప పిల్లలను వేస్తారు. కేజీలల్లో తిలపియ, పంగాస్ చేప పిల్లలను వేసి ఉదయం సా యంద్రం దానా వేస్తారు. 6 నె లల్లో కేజీ బరువు పెరగడం తో 20 టన్నుల దిగుబడి వస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి పొంది లాభం పొందే అవకాశం ఉంది.