ఏప్రిల్‌ 15లోగా ప్రతీ ఇంటికి ‘భగీరథ’ నీరందించాలి

ABN , First Publish Date - 2020-03-08T12:26:54+05:30 IST

ఏప్రిల్‌ 15లోగా ప్రతీ ఇంటికి మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు అందించాలని జడ్పీచైర్మన్‌ జనార్ద న్‌ రాథోడ్‌ అన్నారు.

ఏప్రిల్‌ 15లోగా ప్రతీ ఇంటికి ‘భగీరథ’ నీరందించాలి

నార్నూర్‌, మార్చి7: ఏప్రిల్‌ 15లోగా ప్రతీ ఇంటికి మిషన్‌ భగీరథ ద్వారా  తాగునీరు అందించాలని జడ్పీచైర్మన్‌ జనార్ద న్‌ రాథోడ్‌ అన్నారు. శనివారం మండల కే ంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మి షన్‌ భగీరథ పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మిషన్‌ భగీరథ పనులను చే పట్టి ఇంటింటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో పని చేస్తోందని అన్నారు. సంబంధిత అధికారులు పనుల్లో అలసత్వం చేయకుండా పూర్తి చేసేలా చర్యలు తీసు కోవాలన్నారు.


ఇది వరకే రెండు సమావేశాలలో భగీరథ పనులను పూర్తి చేయాలని నీరు అందించేలా చూడాలని  చెప్పి నా అలసత్వం వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. భగీరథ పనుల కోసం ప్ర భుత్వం నిధులను అందజేస్తున్న పనులు ఎందుకు పూర్తి కావడం లేదని అధికారులను ప్రశ్నించారు. దీంతో అధికారులు ఆ పని కాదంటే తమది కాదని తప్పించుకోనే ప్రయత్నం చేశారు. వేసవి కాలం ప్రారంభం అయిన నేపద్యంలో నీటి సమస్య తీవ్రం కానుందని భగీరత పనుల ఆ లస్యంపై ఆయా గ్రామాల ప్రజాప్రతినిధు లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంకుల్లోకి నీరు వస్తున్న  నల్లాల ద్వారా నీరు రావడం లేదని ఎన్నిసార్లు చె ప్పినా పట్టించుకోవడం లేదని, పనులు పూర్తి చేసి నీరందించాలని వారు కోరారు.


పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని చైర్మన్‌ అధికారులను ప్రశ్నించగా మార్చి చివరికి మండలంలోని అన్ని గ్రామాల్లో ట్యాంకుల కు నీరు సరఫరా ఏప్రిల్‌ 15కు ఇంటింటా నీరు అందిస్తామని గడవు కోరారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, పనులు పూర్తి అయ్యే వరకు మండలాన్ని విడిచి వెళ్లొద్దని, లేదంటే చర్యలు తప్పవని గడువులోపు పనులు పూర్తిచేయాలన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్‌ నాందేవ్‌కాంబ్లే, ఎంపీపీ కనక మోతుబాయి, కోఆప్షన్‌ సభ్యులు దస్తగిర్‌, సర్పంచ్‌ గజానంద్‌నాయక్‌, ఎంపీటీసీలు పరమేశ్వర్‌, అబేదఖానం, నాయకులు అధికారులున్నారు.

Updated Date - 2020-03-08T12:26:54+05:30 IST