ముమ్మరంగా పోలీసుల కూంబింగ్‌

ABN , First Publish Date - 2020-09-06T08:54:13+05:30 IST

ప్రాణహిత గోదావరి తీర ప్రాంతంలో శనివారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు...

ముమ్మరంగా పోలీసుల కూంబింగ్‌

కోటపల్లి, సెప్టెంబరు 5: ప్రాణహిత గోదావరి తీర ప్రాంతంలో శనివారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆసిఫాబాద్‌ కుమ్రంభీం జిల్లాలో డీజీపీ పర్యటిస్తుండటం, భద్రాద్రి జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు బంద్‌కు పి లుపునివ్వడంతో  పోలీసులు అలర్ట్‌ అయ్యారు. మం డలంలోని 63వ నెంబరు జాతీయ రహదారిపై రూర ల్‌ సీఐ నాగరాజు, ఎస్సై రవికుమార్‌, ఏఎస్సై నసీర్‌ అహ్మద్‌లు తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ లకు రాకపోకలు సాగిస్తున్న వాహనాలను ఆపి తనిఖీ లు చేపట్టారు. మరోవైపు కొత్త వ్యక్తుల ఆచూకీ, మావో యిస్టుల కదలికలపై స్థానికులకు పోలీసులు అవగా హన కల్పించారు. 


భీమారం: మండల కేంద్రంలోని పోలంపల్లి వద్ద గల జాతీయ రహదారిపై శనివారం శ్రీరాంపూర్‌ సీఐ బిల్లా కోటేశ్వర్‌, ఎస్‌ఐ బర్ల సంజీవ్‌లు వాహనాల తనిఖీ చేశారు. వాహనాల పత్రాలను పరిశీలించారు.  మావోయిస్టుల కదలికలు ఉన్న నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి చెన్నూరు మీదుగా మంచిర్యాలకు వెళ్లే వాహ నాలను తనిఖీ చేస్తున్నామన్నారు. ఏఎస్‌ఐ భూమయ్య, హెడ్‌కానిస్టేబుల్‌ మాచర్ల పాల్గొన్నారు. 


వేమనపల్లి : మవోయిస్టుల కదలికల నేపథ్యంలో  నీల్వాయి ఎస్‌ఐ రహీంపాషా ఆధ్వర్యంలో సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమా నిత వ్యక్తుల వివరాలను నమోదు చేసుకున్నారు. వేమనపల్లి-బుయ్యారం రోడ్డు మార్గంలోని నాగారం అటవీ ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేశారు.  


దండేపల్లి:  జన్నారం, దండేపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తు న్నారు. తాళ్లపేటలో శుక్రవారం రాత్రి ప్రధాన రహదా రి వద్ద వాహనాలను తనిఖీ చేపట్టారు.  ఎస్సై టీ.శ్రీ కాంత్‌ వాహనాల తనిఖీలు చేశారు.

Updated Date - 2020-09-06T08:54:13+05:30 IST