పార్కులో నిర్మాణానికి బ్రేక్‌...!

ABN , First Publish Date - 2020-10-31T07:11:00+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలలో పార్కుల అభివృద్ధికి కృషి చేస్తుం టే జిల్లా కేంద్రంలో మాత్రం మున్సిపల్‌ పాలకవర్గం అందుకు భిన్నంగా ఉన్న పార్కును తొలగించేందుకు కుట్రలు పన్నింది

పార్కులో నిర్మాణానికి బ్రేక్‌...!

గది నిర్మాణానికి పాలకవర్గం కుట్ర

నిబంధనలకు విరుద్ధంగా మున్సిపాలిటీ అనుమతి

పనులు నిలిపివేయాలని అదనపు కలెక్టర్‌ ఆదేశాలు  

ఫలించిన ప్రతిపక్ష సభ్యుల కృషి


మంచిర్యాల, అక్టోబరు 30: రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలలో పార్కుల అభివృద్ధికి కృషి చేస్తుం టే జిల్లా కేంద్రంలో మాత్రం మున్సిపల్‌ పాలకవర్గం అందుకు భిన్నంగా ఉన్న పార్కును తొలగించేందుకు కుట్రలు పన్నింది. ఐబీ చౌరస్తా సమీపంలో అత్యంత ఖరీదైన స్థలంలో మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు రాంనగర్‌ ప్రజల కోసం 2008లో పార్కు ఏర్పాటు చేశారు. రూ. 13.65 లక్షల నాన్‌ ప్లాన్‌ గ్రాం ట్‌ నిధులతో పార్కులో అన్ని హంగులు ఏర్పాటు చేశారు. పార్కు ఏర్పడ్డ నాటి నుంచి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో విడుతల వారీగా లక్షలాది రూపాయల నిధులు వెచ్చిస్తూ అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తు న్నారు. ప్రస్తుతం ప్రజలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పార్కులో ఉన్నాయి.  పార్కును విచ్ఛిన్నం చేసి, అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రచించగా కాంగ్రెస్‌ కౌన్సిలర్ల ఒత్తిడితో ప్రస్తుతానికి పనులు నిలిచిపోయాయి. 


నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ...

పార్కుల అభివృద్ధికి పాటుపడాల్సిన మున్సిపాలిటీ వాటి విచ్ఛిన్నానికి అనుమతులు జారీ చేయడం గమ నార్హం. పాలకవర్గానికి ఆలోచన వచ్చిందే తడువుగా కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేయడం చకచకా జరిగిపోయాయి. ఇందుకు అధికారులు కూడా వంతపాడటం చర్చనీయాంశమైంది. పార్కు లో వాచ్‌మన్‌ గది నిర్మాణానికి రూ.10 లక్షల జనరల్‌ ఫండ్‌ కేటాయించగా సంసిద్దత తెలుపుతూ పాలక వర్గం తీర్మానం చేసింది. 2019 జనవరిలో జరిగిన అప్పటి పాలకవర్గ సమావేశంలో ఈ తీర్మానం జరు గగా, ఈ నెల 21న గది నిర్మాణానికి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు భూమిపూజ చేశారు. భూమిపూజ జరిగిన వెంటనే పార్కులో ఉన్న చెట్లన్నీ ట్రాక్టర్లతో తొలగించి, పిల్లర్ల నిర్మాణానికి పూనుకున్నా రు. పార్కులో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతు న్నాయని, మందుబాబులకు అడ్డాగా మారిందని కౌన్సిల్‌ సభ్యులు చెబుతున్నారు. దాని నివారించేందు కే వాచ్‌మన్‌ గది నిర్మాణానికి పూనుకున్నట్లు వివరి స్తున్నారు. అయితే వాచ్‌మన్‌ కోసం 25్ఠ32 అడుగుల సైజుతో రూ.10 లక్షల వ్యయంతో గది నిర్మాణానికి పూనుకోవడమే విమర్శలకు తెరలేపింది. వాచ్‌మన్‌ కోసమని చెబుతున్నా అక్కడ ఏకంగా కమ్యూనిటీ హాలు నిర్మాణం జరుగుతోందని, దాంతో ప్రజలకు పార్కు అందుబాటులో ఉండకుండా పోతుందనేది ప్రతిపక్ష సభ్యుల వాదన. ప్రైవేటు వ్యక్తుల కోసం పబ్లిక్‌ పార్కులో, మున్సిపల్‌ నిధులతో నిర్మాణం చేపట్టడంపై ఆగ్రహజ్వాలలు చెలరేగుతున్నాయి.


అదనపు కలెక్టర్‌ ఆదేశాలతో నిలిచిన పనులు....

పార్కులో అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని  ఈ నెల 27న కాంగ్రెస్‌ కౌన్సిలర్లు జిల్లా అధనపు కలె క్టర్‌ (స్థానిక సంస్థలు) ఇలా త్రిపాఠిని కలిసి వినతి పత్రం అందజేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా పార్కును అభివృద్ధి చేయాల్సిందిపోయి, విచ్ఛిన్నానికి పాల్పడుతున్నారని అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకె ళ్లారు. ప్రైవేటుగా ఉపయోగపడే కమ్యూనిటీ హాలుకు మున్సిపల్‌ సాధారణ నిధులు ఎలా కేటాయిస్తారని, ఈ చర్యకు పూనుకోవడం ద్వారా పాలకవర్గ సభ్యులు అధికారంతోపాటు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డా రని ఫిర్యాదు చేశారు. ఘటనపై తక్షణమే స్పందించి, అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. దీనికి స్పందించిన అడిషనల్‌ కలెక్టర్‌ పార్కులో నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని మున్సిపల్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిర్మాణ పనులు నిలిచిపోగా ప్రతిపక్ష సభ్యుల కృషి ఫలించినట్లయింది. 


విచారణ జరుపుతున్నాం...మున్సిపల్‌ కమిషనర్‌ స్వరూపారాణి

రాంగనగర్‌ పార్కులో నిర్మాణాన్ని నిలిపివేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పనులను నిలిపివేయడం జరిగింది. పార్కులో నిర్మిం చ తలపెట్టిన నిర్మాణంపై విచారణ జరిపి కలెక్టర్‌కు రిపోర్టు చేస్తాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతాం. 

Read more