విద్యుత్‌ షాక్‌తో బాలుడి మృతి

ABN , First Publish Date - 2020-12-13T05:43:00+05:30 IST

మండలంలోని గుండంపల్లిలో శని వారం మధ్యాహ్నం విద్యుత్‌ షాక్‌తో సరిమణి శివకుమార్‌(14) అనే బా లుడు మృతి చెందాడు.

విద్యుత్‌ షాక్‌తో బాలుడి మృతి

దిలావర్‌పూర్‌, డిసెంబరు 12 : మండలంలోని గుండంపల్లిలో శని వారం మధ్యాహ్నం విద్యుత్‌ షాక్‌తో సరిమణి శివకుమార్‌(14) అనే బా లుడు మృతి చెందాడు. దిలావర్‌పూ ర్‌ ఎస్సై సంజీవ్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం గుండంపల్లి గ్రా మానికి చెందిన రేషన్‌ డీలర్‌ ప్రభా కర్‌ కుమారుడైన శివకుమార్‌ శనివారం మధ్యాహ్నం వరకు తన మి త్రులతో కలిసి క్రికెట్‌ ఆడాడు. ఇంటికి వచ్చి స్నానం చేసేందుకని నీటి ని వేడి చేసేందుకు బకెట్‌ నీటిలో వాటర్‌ హీటర్‌ వేసి కరెంట్‌ ఆన్‌ చే శాడు. పది నిమిషాల తర్వాత నీళ్లు వేడి అయ్యాయా లేవా అని మరి చిపోయి చేతిని నీటిలో ముంచాడు వెంటనే విద్యుత్‌ షాక్‌కు గురయ్యా డు. కుటుంబీకులు గమనించి నిర్మల్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో సిర్గాపూర్‌ వద్ద మృతి చెందాడు. మృతుడు తల్లిదండ్రులకు శి వకుమార్‌ ఒక్కగానొక్క కొడుకు కావడంతో వారి రోదన గ్రామస్థులకు కంటతడి పెట్టించింది. తల్లిదండ్రులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసినట్లు ఎస్సై సంజీవ్‌ కుమార్‌ తెలిపారు. 

మిత్రులందరితో సరదాగా గడిపి..

అప్పటి వరకు అందరితో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడుతూ గడిపిన శివకుమార్‌ అంతలోనే మృత్యువాత పడడంతో మిత్రులందరూ ఒక్క సారిగా దిగ్ర్భాంతికి గురయ్యారు. వారందరూ మృతదేహం వద్ద విల పించిన తీరు ప్రతీఒక్కరిని కలచివేసింది. 


Updated Date - 2020-12-13T05:43:00+05:30 IST