గొల్లవాగు ప్రాజెక్టులో నాటు పడవ మునక

ABN , First Publish Date - 2020-10-27T10:36:47+05:30 IST

చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి చెందిన సంఘటన భీమారం మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఈరవేణి రాజబాపు, బొంతల రమేష్‌, సుంకరి సంపత్‌, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని

గొల్లవాగు ప్రాజెక్టులో నాటు పడవ మునక

ఫ చేపల వేటకు వెళ్ళిన ఇద్దరి మృతి  ముగ్గురిని కాపాడిన స్థానికులు  పండుగ పూట విషాదం 


భీమారం, అక్టోబరు 26: చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి చెందిన సంఘటన  భీమారం మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఈరవేణి రాజబాపు, బొంతల రమేష్‌, సుంకరి సంపత్‌, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన కలవేణి రమే ష్‌, మచ్చ రవిలు ఆదివారం దసరా పండుగ రోజు గొల్ల వాగు ప్రాజెక్టులో నాటు పడవలో చే పల వేటకు వెళ్ళారు. కొంత సేపు చేపలు పట్టిన అనంతరం పోతన్‌పల్లి ఒడ్డుకు చేరుకుని సేద తీరారు. అనంతరం సాయంత్రం 3 గంటల ప్రాం తంలో చేపలను తీసుకుని తిరుగు ప్రయాణం కాగా ప్రమాదవశాత్తు నాటు పడవ  మునిగిపో యింది. దీంతో పడవలో ప్రయాణిస్తున్న ఈర వేణి రాజబాపు(28), బొంతల రమేష్‌ (38) నీటిలో కొట్టుకుపోయారు. సుంకరి సంపత్‌ చెట్టు ను పట్టుకోగా  కలవేణి రమేష్‌, మచ్చ రవిలు నాటు పడవను పట్టుకుని కాపాడాలని బిగ్గరగా అరిచారు. పోతన్‌పల్లి శివారులోని పత్తి చేనులో పనిచేస్తున్న బానోత్‌ రాజేందర్‌ సంఘటన స్థలా నికి చేరుకుని బంధువులకు సమాచారం అందిం చారు. అనంతరం సుంకరి వెంకటేష్‌, రాజేందర్‌ లు నాటు పడవలో ప్రాజెక్టులోకి వెళ్లి ముగ్గు రిని ఒడ్డుకు చేర్చారు. రాజబాపు, రమేష్‌లు నీటి లో కొట్టుకుపోయారు.


శ్రీరాంపూర్‌ సీఐ బిల్లా కోటేశ్వ ర్‌, శ్రీరాంపూర్‌ ఎస్‌ఐ లకావత్‌ మంగీలాల్‌,  ఎస్‌ఐ బర్ల సంజీవ్‌లు సంఘటన స్థలానికి చేరు కున్నారు. ఆదివారం చీకటి కావడంతో గాలింపు చేపట్ట లేదు. సోమవారం గోదావరిఖని రెస్య్కూ టీం, మంచిర్యాల ఫైర్‌ టీం, జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టగా సాయంత్రం మృతదేహాలు లభించాయి. జైపూర్‌ ఏసీపీ నరేందర్‌, ఆర్డీవో రమేష్‌,  తహసీల్దార్‌ విజయానందం, సర్పంచు  రాంరెడ్డి, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలా నికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడు రమేష్‌కు భార్య భాగ్యలక్ష్మీతోపాటు ఇద్దరు కుమా రులు, కూతురు ఉండగా, రాజబాబుకు భార్య శ్రావణిఉంది. ఘటనాస్థలం పరిసరాల్లో మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇద్దరి మృతిపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఉదయం నుంచి సాయంత్రం వరకు గాలింపు 

శ్రీరాంపూర్‌ సీఐ బిల్లా కోటేశ్వర్‌రావు గోదావరి ఖని, శ్రీరాంపూర్‌, మంచిర్యాల ఫైర్‌ రెస్క్యూ టీం లను రప్పించారు. రెస్క్యూ సిబ్బంది  ప్రాజెక్టులో మర బోటు ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే జాలర్లు నాటు పడవల ద్వారా మృత దేహాల కోసం సోమవారం ఉదయం పది గం టల నుంచి సాయంత్రం వరకు వలలతో, పాతా ళ గరిగెలతో ప్రాజెక్టులో గాలించారు.  మృతదే హాలు నీటిలో పైకి తేలడంతో రెస్క్యూ సిబ్బంది  వాటిని ఒడ్డుకు చేర్చారు. 

Updated Date - 2020-10-27T10:36:47+05:30 IST