ఆసిఫాబాద్‌ జిల్లాలో దుప్పట్ల పంపిణీ

ABN , First Publish Date - 2020-12-28T03:36:24+05:30 IST

మండలంలోని వేంపల్లిలోని కొలాంగూడ గిరిజనులకు స్థానిక ఈడెన్‌ గార్డెన్‌ పాఠశాల సౌజన్యంతో పోలీసులు దుప్పట్ల పంపిణీ చేపట్టారు.

ఆసిఫాబాద్‌ జిల్లాలో దుప్పట్ల పంపిణీ
సిర్పూర్‌(టి)లో దుప్పట్లు పంపిణీ చేస్తున్న ఎస్సై రవికుమార్‌

సిర్పూరు(టి), డిసెంబరు 27: మండలంలోని వేంపల్లిలోని కొలాంగూడ గిరిజనులకు స్థానిక ఈడెన్‌ గార్డెన్‌ పాఠశాల సౌజన్యంతో పోలీసులు దుప్పట్ల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా సిర్పూరు(టి) ఎస్సై రవి కుమార్‌ మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా బ్లాంకెట్లను పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ సత్యం, సర్పంచ్‌ డోలె లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జైనూర్‌: మండలంలోని ఢబోలి షేకుగూడలో ఆదివారం పోలీస్‌శాఖ ఆఽధ్యర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఎస్సై తిరుపతి మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు పేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కుంర దుందెరావ్‌, సర్పంచ్‌ మేస్రాం నాగోరావ్‌, ఎంపీటీసీ మేస్రాం భొజ్జుపటేల్‌, మాజీ ఎంపీటీసీ మేస్రాం మక్కు గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T03:36:24+05:30 IST