కుమరం భీం జిల్లాలో పేద ప్రజలకు అండగా ఉంటాం

ABN , First Publish Date - 2020-12-12T04:34:23+05:30 IST

పేద ప్రజలకు పోలీసు శాఖ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుందని ఆసిఫాబాద్‌ డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు అన్నారు.

కుమరం భీం జిల్లాలో పేద ప్రజలకు అండగా ఉంటాం
ఆదివాసీలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు

- ఆసిఫాబాద్‌ డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు

సిర్పూర్‌(యూ), డిసెంబరు 11:  పేద ప్రజలకు పోలీసు శాఖ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుందని ఆసిఫాబాద్‌ డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు అన్నారు. మండలంలోని భాండేయెర్‌లో శుక్రవారం పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిర్పూర్‌(యు, లింగాపూర్‌ మండలాల విద్యావంతులైన యువతి యువకులకు ఆంగ్ల మాధ్యంపై మక్కువ కనబర్చెల సిర్పూర్‌(యు)లోని ఆదర్శ పాఠశాలలో ప్రత్యేక ఆవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆదేవిధంగా  భాండియెర్‌, రుద్రకసా, నాగుగూడ, ముంజిగూడ  గ్రామాలకు చెందిన 210 మంది ఆదివాసీలకు వసుధ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. . కార్యక్రమంలో ప్రొఫెసర్‌ రఫిక్‌, జైనూర్‌ సీఐ సీహెచ్‌ హనుక్‌, సిర్పూర్‌ ఎసై విష్ణువర్ధన్‌, భాండియెర్‌ సర్పంచ్‌ కుంర గంగాదేవి, పాములవాడ సర్పంచ్‌ పెందుర్‌ నాగోరావ్‌, వీటీడీఏ చైర్మెన్‌ కుంర భీంరావ్‌, రాయిసెంటర్‌ సార్‌మెడి తోడ్సం రాజారాం తదతరులు పాల్గ్గొన్నారు.

కెరమెరి: మండలంలోని కొత్తగూడ గ్రామంలో శుక్రవారం ఆసిఫాబాద్‌ డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో పోలీసుల ఆధ్వర్యంలో పేదలకు తమ వంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ సుధాకర్‌, ఎస్సై రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T04:34:23+05:30 IST