రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీదే అధికారం

ABN , First Publish Date - 2020-12-08T03:58:47+05:30 IST

రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుం దని జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీదే అధికారం
మంచిర్యాలలో విజయోత్సవ ర్యాలీలో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌

జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ 

ఏసీసీ, డిసెంబరు 7 : రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుం దని జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన మేర ఫలితాలను సాధించినందుకు సోమవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రఘునాథ్‌ మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తల కృషి వల్లే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయం లభించిందన్నారు. టీఆర్‌ఎస్‌ నిరం కుశ పాలనకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించా రన్నారు.  రైతు అభివృద్ధి కోసం మోదీ నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొస్తే కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపిన టీఆర్‌ఎస్‌ బంద్‌లో పాల్గొంటుందని ఆయన విమర్శించారు. సన్నరకం వడ్లు పండించమని చెప్పి సరైన మద్దతు ధర చెల్లిం చకుండా రైతులను మోసం చేస్తుందన్నారు. నాయకులు గోనె శ్యాంసుందర్‌రావు,  రజనీష్‌జైన్‌, శ్రీనివాస్‌, మల్లేష్‌, పురుషోత్తం, తులా మధుసూదన్‌రావు, బోయిని హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-08T03:58:47+05:30 IST