రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతోనే బీజేపీకి ఆదరణ

ABN , First Publish Date - 2020-12-29T04:11:44+05:30 IST

రాష్ట్రంలో టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, పరిపాలన వైఫల్యాల కారణంగా బీజేపీకి ఆదరణ పెరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్‌ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతోనే బీజేపీకి ఆదరణ
మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్‌

 బెల్లంపల్లి, డిసెంబరు  28:  రాష్ట్రంలో టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, పరిపాలన వైఫల్యాల కారణంగా బీజేపీకి ఆదరణ పెరుగుతుందని  బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్‌ అన్నారు. పాత బస్టాండ్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన కార్యాల యాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుం దన్నారు. కార్యక్రమంలో కోడి రమేష్‌, గోనె శ్యాంసుందర్‌రావు, గోపతి మల్లేష్‌, అందుగుల  శ్రీనివాస్‌, ఆనంద్‌ కృష్ణ, సంతోష్‌,  మధుసుధన్‌,  పోషం, పత్తి శ్రీనివాస్‌, మధుసుధన్‌ పాల్గొన్నారు.   


Updated Date - 2020-12-29T04:11:44+05:30 IST