సింగరేణి వైద్యులకు ప్రయోజనాలు

ABN , First Publish Date - 2020-07-22T10:33:04+05:30 IST

సింగరేణిలో కరోనా వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి యాజమాన్యం పలు ప్రయోజనాలు కల్పిస్తోంది.

సింగరేణి వైద్యులకు ప్రయోజనాలు

కరోనా సేవలు అందిస్తున్న వారికి  50 లక్షల బీమా

నెల జీతంలో బేసిక్‌పై 10 శాతం అలవెన్స్‌

నేటి నుంచి గనుల వద్ద సమావేశాలు రద్దు

కేసులు పెరిగితే తాత్కాలికంగా గనిని మూసివేస్తాం

వైరస్‌ సోకిన కార్మికులకు సెలవులు మంజూరు  

 

మంచిర్యాల, జూలై 21 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో కరోనా వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి యాజమాన్యం పలు ప్రయోజనాలు కల్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే ప్రతి నెలా వారి బేసిక్‌ వేత నంపై 10 శాతం ప్రోత్సాహక అలవెన్స్‌ చెల్లించడానికి,  ప్రభుత్వం కల్పించిన రూ.50 లక్షల బీమా సౌక ర్యం వర్తింపజేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకొంది. ఇందుకు సంబంధించిన ఒక ప్రకటన విడుదల చేశారు.  


సింగరేణి డైరెక్టర్‌ పర్సనల్‌ అండ్‌ ఆపరేషన్స్‌ ఎస్‌.చం ద్రశేఖర్‌ అందుకు సంబంధించిన పలు విషయాలను ఆంధ్రజ్యోతి ప్రతినిధికి  తెలిపారు. ప్రతి ఏరియాలో కరోనా కట్టడికి క్వారంటైన్‌ సెంటర్లుగా సీఈఆర్‌ క్లబ్‌లు, పాఠశాలలు కేటాయిస్తామని తెలిపారు. అత్యవసర మందుల కోసం ఆర్డర్‌ చేశామని, ఏరియాసుపత్రులలో ప్రత్యేక ఐసీయూ వార్డులు ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రు లలో చికిత్స  అందిస్తామని పేర్కొన్నారు. కరోనా పరీక్షల కోసం ప్రత్యేక ల్యాబ్‌ నిర్వహిస్తున్నామన్నారు.  సింగరేణి వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నందున కరోనా వార్డుల ఏర్పాటుతోపాటు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.  ప్రతీ క్వారంటైన్‌ సెంటర్‌లో డాక్టర్‌, వైద్య సిబ్బంది 24 గంటలు సేవలందిస్తున్నారని తెలిపారు. కరోనా వైద్యం కోసం మందులు అందుబాటులో ఉంచుతున్నామని, ఒక్కొక్కటి రూ.14 వేల ఖరీదైన యాంటీ వైరల్‌ డోస్‌లను కంపెనీ సమకూర్చుతుందన్నారు. 


కేసులు పెరిగితే గనిని మూసివేస్తాం... 

ఏదైనా గనిలో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లయితే అక్కడ పనిచేసే కార్మికుల రక్షణ, ఆరోగ్యం దృష్ట్యా ఆ గనిని కొంత కాలం మూసివేస్తామని చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. కార్మికుల రక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని, కరోనా వ్యాధి సోకిన వారికి ప్రత్యేక క్వారంటైన్‌ సెలవులను యాజమాన్యం మంజూరు చేస్తోందని పేర్కొన్నారు. కరోనా నివారణ చర్యలపై  ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యాధి సోకకుండ కార్మికుడు, వారి కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. 


యూనియన్ల గేట్‌ మీటింగ్‌లు రద్దు

కరోనా కేసులు పెరుగుతున్నందున బుధవారం నుంచి  రెండు నెలల పాటు గనుల వద్ద, డిపార్ట్‌మెంట్ల వద్ద సమావేశాలకు అనుమతి ఇవ్వబోమని చంద్రశేఖర్‌ తెలిపారు. మీటింగ్‌లపై బ్యాన్‌ను విధించే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి రక్షణ దృష్ట్యా యూనియన్‌ మీటింగ్‌లను  పెట్టవద్దని ఆయన కోరారు. 


కరోనాతో కలత చెందుతున్న కార్మికులు

బొగ్గుబావుల్లో కరోనాతో కార్మికులు కలత చెందుతు న్నారు. రోజురోజుకు పాజిటివ్‌ సంఖ్య పెరుగుతుం డటంతో  ఆందోళన వ్యక్తమవుతోంది. 150 మంది కార్మి కులను, వారి కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్‌, 85 మందికి కరోనా లక్షణాలు ఉండటంతో ఐసోలేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం 40కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 12 మంది అంతకుముందే డిశ్చార్జి అయ్యారు. గాంధీ ఆసుపత్రిలో కూడా ఐదుగురు, నేచర్‌క్యూర్‌లో మరో ఐదుగురు, హైదరాబాద్‌లోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటి వరకు సింగరేణి వ్యాప్తంగా నలుగురు కార్మికులు మరణించారు. సింగరేణి యాజమాన్యం కట్టడి ప్రాం తంలో ఉన్న వారికి అలాగే ఐసోలేషన్‌, క్వారంటైన్‌లో ఉన్న వారికి జీతంతో కూడిన సెలవును మంజూరు చేయాలని కార్మిక  సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

Updated Date - 2020-07-22T10:33:04+05:30 IST