లాక్‌.. లాస్‌!

ABN , First Publish Date - 2020-05-17T09:45:07+05:30 IST

కరోనాదెబ్బకు మద్యం అమ్మ కాలు భారీగా పడిపోతున్నాయి. లాక్‌డౌన్‌ అమలుతో దాదాపుగా 40 రోజులకు పైగా మూసి ఉన్న

లాక్‌.. లాస్‌!

జిల్లాలో 10 రోజుల్లో రూ.12కోట్ల మద్యం అమ్మకాలు 

వేసవిలోనూ పడిపోయిన బీర్‌ అమ్మకాలు

బార్లలో నిల్వ ఉన్న మద్యాన్ని వైన్స్‌లకు.. 

ఆర్థిక ఇబ్బందులతో మద్యానికి దూరంగా మందుబాబులు


ఆదిలాబాద్‌, మే16 (ఆంధ్రజ్యోతి) : కరోనాదెబ్బకు మద్యం అమ్మ కాలు భారీగా పడిపోతున్నాయి. లాక్‌డౌన్‌ అమలుతో దాదాపుగా 40 రోజులకు పైగా మూసి ఉన్న మద్యం దుకాణాలను ఈ నెల 6 నుం చి ప్రారంభించారు. జిల్లాలో 31 వైన్స్‌షాపులు, 12 బార్లు ఉన్నాయి. ఇందులో మద్యం షాపులను మాత్రమే ప్రారంభించి బార్‌లను మూ సి వేయించారు. గతంలో  మాదిరిగా కాకుండా ఉదయం 10 గంట ల నుంచి సాయంత్రం 6 గంటల వరకే తెరిచి ఉంచడంతో అమ్మకా లు ఊపందుకోవడం లేదు. ఉదయం 8 గంటలకే భానుడి భగభగ లకు బయటకు వెళ్లలేని పరిస్థితులు కనిపించడం లేదు. 10 గంటల కు ఎండ తీవ్రత పెరిగిపోయి బయటకు వెళ్లలేక జనం ఇంటికే పరి మితమవుతున్నారు.


సాయంత్రం 6 గంటలకే మద్యం షాపులను మూసివేయడంతో ఆ తర్వాత మద్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితు లు కనిపించడం లేదు. పగలంతా పని చేసిన వారంతా రాత్రివేళ ల్లోనే మద్యం తాగి అలసట తీర్చుకుంటారు. కానీ, రాత్రిళ్లు మద్యం అమ్మకాలకు అనుమతి లేకపోవడంతో మందుబాబులు మద్యానికి దూరంగా ఉంటున్నారు. పర్మిట్‌ రూంలకు అనుమతి లేకపోవడం, ఇంకా లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగడంతో విచ్చలవిడిగా మద్యాన్ని సేవించే వీలు లేకుండా పోయింది.


గత సంవత్సరం మే నెలలో లిక్కర్‌, బీర్‌ అమ్మకాలతో రూ.21 కోట్ల 88 లక్షల 76 వేల 293 ఆదా యం రాగా, అదే ఈ ఏడాది మే 6 నుంచి 15 వరకు గడిచిన 10 రోజుల్లో 12 కోట్ల 59 లక్షల 234 రూపాయల ఆదాయం వచ్చింది. అంటే మిగిలిన 14 రోజుల్లో సుమారు రూ.10కోట్లకు పైగా ఆదా యం రావాల్సి ఉంటుంది. గతంలో ఒక్కో షాపులో 3 రూపాయల లక్షల సేల్స్‌ జరిగేవి. ప్రస్థుతం రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షల మధ్య అమ్మకాలు జరుగుతున్నట్లు అధికారులు పేర్కొం టున్నారు. 


కూల్‌మద్యానికి దూరం..

ప్రతి ఏడాది వేసవిలో బీర్‌ అమ్మకాలు భారీగా ఊపందుకుంటా యి. కానీ, ఈ సారి అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. కరో నా ఎఫెక్ట్‌తో కూల్‌ మద్యానికి కొంత దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరించడంతో బీర్లను కొనుగోలు చేయడం లేదు. భారీగా డిమాండ్‌ ఉన్న కింగ్‌ ఫిషర్‌ బీర్లు సరఫరా కావడం లేదు. లాక్‌డౌన్‌ ఆంక్షలతో బెల్ట్‌షాపులపై పోలీసులు నిఘా పెట్టడంతో బీర్లను ఫ్రిజ్‌ లో పెట్టి అమ్మేందుకు బెల్ట్‌ షాపు యజమానులు ఆసక్తి చూపడం లేదు. ధరలు కూడా అమాంతంగా 20 నుంచి 30 శాతం పెరిగిపో వడంతో అమ్మకాలు తగ్గిపోయినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు 86 శాతం బీర్‌ అమ్మకాలు మైనస్‌లో ఉన్నట్లు అధికారులు పేర్కొంటు న్నారు. ఎండతాపానికి బీర్లను తాగేవారంతా ధర పెరుగడం, ఇతర కారణాలతో కిక్కుకోసం లిక్కర్‌నే తాగుతున్నట్లు తెలుస్తుంది. 


కాలపరిమితి ముగిసే మద్యం తరలింపు..

లాక్‌డౌన్‌తో గత రెండు మాసాలుగా బార్లను పూర్తిగా మూసి ఉంచారు. ఇప్పటికే బార్‌లలో నిల్వ ఉన్న బీర్‌ బాటిళ్లను ఇతర వైన్స్‌లకు ఎక్సైజ్‌ అధికారులు సరఫరా చేస్తున్నారు. ఈ నెలతో కాల పరిమితి ముగిసి పోయే బీర్‌ బాటిళ్లను గుర్తించి అధికారులు ఇతర వైన్స్‌లకు తరలిస్తున్నారు. జిల్లాలో 12బార్లు ఉండగా 5 బార్లలోనే బీర్‌ బాటిల్లు నిల్వ ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 552 బీర్‌ బాటిల్స్‌, మరో 103 చిన్న బీర్‌ బాటిల్స్‌లను ఇతర వైన్స్‌లకు సరఫరా చేశారు. వీటికి పెరి గిన ధరలు కాకుండా మే 5 వరకు ఉన్న డిపో ధర ప్రకారం బార్‌ యజమానులకు చెల్లించనున్నారు. 


చేతిలో నగదు లేక...

గత రెండు నెలలుగా లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితం కావడం, పనులు దొరకక చేతిలో నగదు లేక ఆర్థిక ఇబ్బందులతో అల్లాడు తున్న వారంతా మద్యం కొనుగోళ్లకు వెనుకాడుతున్నట్లు తెలుస్తోం ది. వ్యవసాయ ఆధారిత జిల్లాలో ప్రస్థుతం వ్యవసాయ పనులు కూ డా ముగిసి పోవడం, పూర్తి స్థాయిలో వ్యాపారాలు ప్రారంభంకాక పోవడం, నిర్మాణ రంగంలో పనులు లేక వేసవి సీజన్‌ వ్యాపారాలు సాగక చిరు వ్యాపారులు, దినసరి కూలీలు ఇబ్బందులు పడుతున్నా రు. జిల్లాలో ఎక్కడ లేబర్‌ అడ్డాలు లేక పోవడం, పనికి పిలిచే వారే కరువవడంతో నగదుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్న కొదొ ్దగొప్ప ఆదాయాన్ని కుటుంబ పోషణకే కేటాయించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు మందుబాబులు మద్యం కొనుగోళ్లకు దూరంగానే ఉంటున్నారు.


మద్యం సేల్స్‌ పడిపోతున్నాయి..

గతంతో పోల్చుకుంటే ఈ వేసవిలో మద్యం సేల్స్‌ భారీగా పడిపోతున్నాయి. మద్యం దుకాణాలను ప్రారంభించిన రెండు రోజేలే అమ్మకాలు పెరిగినా ఆ తర్వాత ఆదాయం పడిపోతు వస్తోంది. ముఖ్యంగా బీర్‌ అమ్మకాలు పడిపోతున్నాయి. వేస విలోనూ లిక్కర్‌నే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మద్యం అమ్మకాలపై కరోనా ఎఫెక్ట్‌ ఎక్కువగానే కనిపిస్తోంది. షాపుల వద్ద కొనుగోలుదారులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. 

- శ్రీనివాస్‌ (ఎక్సైజ్‌ సీఐ, ఆదిలాబాద్‌)


Updated Date - 2020-05-17T09:45:07+05:30 IST