సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి:కలెక్టర్
ABN , First Publish Date - 2020-08-20T10:52:24+05:30 IST
సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండా లని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు.

ఆసిఫాబాద్, ఆగస్టు 19: సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండా లని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మంది రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సంబంధిత అదికారులతో సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు 3,837 శాంపిల్స్‌ని గాంధీ ఆ సుపత్రికి పంపించగా అందులో 266 పాజిటివ్‌గా నిర్ధారించడం జరిగిందని, 3,509 మందికి నెగెటివ్, 62 మంది రిజల్ట్స్ రావాల్సి ఉందన్నారు. గోలేటి క్వారంటైన్‌లో ఐదు గురు, సింగరేణి ఐసోలేషన్‌లో ఐదుగురు, వాంకిడి క్వారంటైన్‌లో 19 మంది, ఆసిఫా బాద్‌లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 78 మంది, సీహెచ్‌సీ ఆ సిఫాబాద్‌లో 24 మంది మొత్తం 131 మంది కొవిడ్ అనుమానితులు ఉన్నారన్నారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి రాంబాబు, డీఆర్వో కదం సురేష్, ఆర్డీవోలు సిడాం దత్తు, చిత్రు, డీఎంహెచ్‌వో కుమరం బాలు, డీపీఓ రమేష్, సీఐ అనిల్‌కుమార్, తహసీల్దార్ ఎజాజ్‌ఖాన్ పాల్గొన్నారు.