సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-05-29T10:49:17+05:30 IST

వానాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యా ధులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, క్లోరినేష న్‌, పారిశుధ్యం నిర్వహణపై దృష్టి

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ భారతి హోళికేరి

  

నస్పూర్‌, మే 28: వానాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యా ధులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, క్లోరినేష న్‌, పారిశుధ్యం నిర్వహణపై దృష్టి సారించాలని కలెక్టర్‌ భారతి హొళికేరి అన్నారు. గురువారం నస్పూర్‌లోని సింగరేణి అతిథి గృహంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ట్రైనీ కలెక్టర్‌ కుమార్‌దీపక్‌లతో కలిసి తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు,  వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించా రు. కలెక్టర్‌ మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నివారణకు అన్ని శాఖల అధికారులు  తగిన ప్రణాళిక లతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. నివాసాలు, పరిసర ప్రాంతాలతోపాటు రోడ్లపై నీరు నిల్వకుండా, చెత్తాచెదారం పేరుకుపోకుండా పారిశుధ్య సిబ్బంది పనిచేయాలని, దోమలు వృద్ధి చెంది విషజ్వరాలు ప్రబ లకుండా చర్యలు చేపట్టాలన్నారు.


వారానికోసారి హైడ్రోక్లోరైడ్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాలని, వీటిని జిల్లా కేంద్రంలో కొనుగోలు చేసుకోవచ్చన్నారు. మున్సిపల్‌ పరిధిలో పారిశుధ్యంతోపాటు, రోడ్లపై నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఫాగింగ్‌ యంత్రాలు సమకూ ర్చుకోవాలన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగం గా భౌతికదూరం పాటిస్తూ మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలన్నారు.  ఎవరైనా మాస్క్‌ ధరించనట్లయితే పంచాయతీ అధికారులు జరిమానా విధించాలని, కొవిడ్‌-19 ప్రమాదం ఉన్నందున ఇంటింటి సర్వేతోపా టు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.


గతంలో సీజనల్‌ వ్యాధుల ప్రభావం అధికంగా ఉన్న దం డేపల్లి మండలం జైతుగూడ, బైరంగూడ, వేమనపల్లి మండ లం గొర్లపల్లి, కోటపల్లి మండలం పారుపల్లి, కాసిపేట మండలం మామిడిగూడ, మోతుగూడ, కోమటిచేనుతోపాటు 22 సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.  జూన్‌ 10వ తేదీలోగా  ఇంకుడుగుంతలు, 20వ తేదీలోగా డంపింగ్‌ యార్డ్‌లు, 30వ తేదీలోగా వైకుంఠధామాలు పూర్తయ్యేలా చూడా లన్నారు. ప్రభుత్వాసుపత్రులతోపాటు ప్రైవేటు ఆసుప త్రులలో రోగుల వివరాలను వైద్య, ఆరోగ్య అధికారుల కు తెలపాలన్నారు. ప్రతీ ఇంట్లో వారంలో ఒక రోజు డ్రైడే నిర్వహించాలన్నారు. జిల్లా రెవెన్యూఅధికారి రాజే శ్వర్‌, డీఎంహెచ్‌వోనీరజ, డీపీవో వీరబుచ్చయ్య, డీఆర్‌డీఏ పీడీశేషాద్రి, ముఖ్యప్రణాళికఅధికారి సత్యనా రాయణరెడ్డి, మున్సి పల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.  


మొక్కల పెంపకంలో అలసత్వం వద్దు

జైపూర్‌: మొక్కల పెంపకంలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ భారతి హోళికేరి పేర్కొ న్నారు. గురువారం మిట్టపల్లి, జైపూర్‌ నర్సరీల్లో మొ క్కల పెంపకాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నా రు. వర్షాకాలంలో ప్రతి ఇంటికి 6 మొక్కలను ఇచ్చే వి ధంగా మొక్కలను సిద్ధం చేయాలన్నారు. ఎంపీడీవో కె నాగేశ్వర్‌రెడ్డి, మండల పంచాయతీ అధికారి కె సతీష్‌ కుమార్‌, ఈజియస్‌ ఏవో బాలయ్య  పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-29T10:49:17+05:30 IST