ఎడ్లబండి పైనుంచి జారీ పడి నాలుగేళ్ల బాలుడి మృతి
ABN , First Publish Date - 2020-12-07T06:24:32+05:30 IST
ప్రమాదవశాత్తు ఎడ్లబండి పైనుంచి జారిపడి నాలుగేళ్ల బాలుడి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనతో మావల మండలంలోని వాఘాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

మావల, డిసెంబరు 6: ప్రమాదవశాత్తు ఎడ్లబండి పైనుంచి జారిపడి నాలుగేళ్ల బాలుడి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనతో మావల మండలంలోని వాఘాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చాకట్ సుజాత, ప్రేమ్‌కుమార్ దంపతుల కుమారుడైన చాకత్ బ్రహ్మత్(4) తన తాత స్వామితో ఎడ్లబండిపై ఎక్కాడు. పని నిమిత్తం తన తాత ఎడ్లబండిలో ఇటుకలు పేర్చుతున్న క్రమంలో ఆ బాలుడు ముందుభాగంగా కూర్చున్నాడు. అనుకోకుండా ఇంతలో ఎడ్లబండి కదలడంతో ఆ బాలుడు బండి పైనుంచి జారీ కింద పడ్డాడు. దీంతో బాలుడి తల మీదుగా ఎడ్లబండి చక్రం వెళ్లడంతో చాకత్ బ్రహ్మత్ అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బం ధువులు శోకసంద్రంలో మునిగి పోయారు.