అందరూ సమన్వయంతో పనిచేయాలి

ABN , First Publish Date - 2020-07-08T10:37:22+05:30 IST

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వ విప్‌ బాల్క సుమ న్‌ ..

అందరూ సమన్వయంతో పనిచేయాలి

మందమర్రిరూరల్‌, జూలై 7: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వ విప్‌ బాల్క సుమ న్‌ పేర్కొన్నారు. మంగళవారం సీఈఆర్‌ క్లబ్‌లో మండల సమావేశం ఎంపీపీ గుర్రం మంగశ్రీనివాస్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సుమన్‌ మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు సాగాలని పేర్కొన్నారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం వల్ల అధికార వికేంద్రీకరణ జరిగి ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందుతాయ న్నారు.


గ్రామాల్లో డంపింగ్‌యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. కాళేశ్వరం నుంచి చెన్నూరు నియోజకవర్గంలో సాగు నీరందించేం దుకు చేపట్టే సర్వే ఈనెలలో పూర్తవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు హరితహారంలో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీఓదెలు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. జడ్పీటీసీరవి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రావు, ఎంపీ డీవో ప్రవీణ్‌కుమార్‌, తహసీల్దార్‌ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. 


అందుగులపేటకు చెందిన ఏనుగు జ్యోతికి ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ కూరగాయల ట్రాలీని అందజేశారు. సేంద్రియ వ్యవసాయం చేస్తున్న జ్యోతికి రూ.1.60 లక్షల విలువ చేసే ఆటోట్రాలీని ఐకేపీ ద్వారా అందిచారు.  


అందుగులపేటలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని విప్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. ఎంపీపీ గుర్రం మంగగౌడ్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేణికుం ట్ల ప్రవీణ్‌, సర్పంచు తిరుపతిరెడ్డి, ఏసీపీ రహెమాన్‌ పాల్గొన్నారు. వాటర్‌ప్లాం ట్‌ను ప్రారంభించారు. పులిమడుగు, సారంగపల్లి గ్రామాల్లో డంపింగ్‌యార్డులను ప్రారంభించారు. సర్పంచులు దేవి, ఫర్హీనాసుల్తానాఫిరోజ్‌, నాయకులు పాల్గొన్నారు.


ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలి 

భీమారం: ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్‌ పేర్కొన్నారు. మంగళవారం తహసీల్దార్‌ కా ర్యాలయాన్ని సందర్శించారు. విప్‌ మాట్లాడుతూ ప్రతి పంచాయతీలో పల్లె ప్రకృతి వనాలకు, కార్యాలయాలకు ప్రభుత్వ భూములను ఉపయోగించాలని, ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా  కాపాడాలన్నారు. మండల కేంద్రంలోని 138 సర్వే నెంబరు లో గల భూమిని పూర్తిస్ధాయిలో సర్వే చేసి ప్రభుత్వ కార్యాలయాలకు  వినియో గించేలా చూడాలని తహసీల్దార్‌ విజయానందంకు సూచించారు. మండల కేంద్రం లో జాతీయ రహదారి విస్తరణ పనులు నడుస్తుండగా పరిశీలించారు. పోలంపల్లి   రైతులు ధాన్యం డబ్బులు పూర్తిస్ధాయిలో రావడం లేదని, కోత విధించారని విప్‌న కు తెలుపగా రైతులకు న్యాయం చేయాలని ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ను ఆదేశించారు. 


అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

జైపూర్‌: మండలంలోని గంగిపెల్లి శ్మశాన వాటిక, డంపింగ్‌ యార్డు, శెట్‌పల్లి లోని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రభుత్వ  విప్‌ బాల్క సుమన్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ ప్రారంభించారు. ఎంపీపీ గోదారి రమాదేవి, జడ్పీటీసీ  సునీత, శ్రీనివాస్‌ రెడ్డి, సర్పంచ్‌లు లింగారెడ్డి,  మేడి రవి పాల్గొన్నారు.

Updated Date - 2020-07-08T10:37:22+05:30 IST