కన్నుల పండువగా అయ్యప్ప పడిపూజ
ABN , First Publish Date - 2020-12-31T05:21:21+05:30 IST
జిల్లా కేంద్రంలోని చింతకుంట వాడలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. సిద్ధు గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన పడిపూజలో అయ్యప్ప ఉత్సవ విగ్రహనికి పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు.
నిర్మల్ టౌన్, డిసెంబరు 30: జిల్లా కేంద్రంలోని చింతకుంట వాడలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. సిద్ధు గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన పడిపూజలో అయ్యప్ప ఉత్సవ విగ్రహనికి పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామికి వివిధ రకాల పూలతో పుష్పార్చన చేశారు. పడిపూజ నిర్వహించిన స్వామి 18వ సారి మలాధారణ స్వీకరించడంతో నిర్మల్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో కొబ్బరి చెట్టు, యోగ దండన అందజేసి సత్కరించారు. పూజా కార్యక్రమానికి స్వాములతో పాటు స్థానిక భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్పల భజన పాటలతో అక్కడి ప్రాంగణం స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో కడ్తాల్ గ్రామ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయ గురుస్వామి నర్సారెడ్డి, చెనిగారపు చిన్నయ్య, మూర్తి, అమ్ముల రాజు, అమ్ముల ధర్మేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
రేపు విఠలేశ్వర ఆలయంలో..
కుభీర్: మండల కేంద్రంలోని విఠలేశ్వర స్వామి ఆలయంలో శుక్రవా రం మహాపడిపూజ నిర్వహించనున్నట్లు అయ్యప్ప స్వాములు తెలిపారు. ముందుగా గ్రామంలో శోభయాత్ర నిర్వహించి, అన్నతరం మహాపడిపూజ ప్రారంభించనున్నట్లు, అ తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. వేద పండితులు విశాల్‌శర్మ ఆధ్వర్యంలో, నేరడిగొండ శ్రీకాంత్ కళాబృందం ద్వారా నిర్వహించే పడిపూజకు స్వాములతో పాటు, భక్తులు హాజరై విజయవంతం చేయాలని గురుస్వాములు ప్రభాకర్‌స్వామీ, పెంటాజీ స్వామి, కందూర్ దత్తు స్వామీ, గడ్డం సంజీవ్ స్వామి, ఎన్నిల అనీల్ స్వాములు కోరారు.