హరిహర క్షేత్రంలో అయ్యప్ప మండలపూజ

ABN , First Publish Date - 2020-12-29T06:13:06+05:30 IST

అయ్యప్ప నామస్మరణతో హరిహరక్షేత్రం మారుమోగింది. పట్టణంతో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి స్వాములు హాజర య్యారు.

హరిహర క్షేత్రంలో అయ్యప్ప మండలపూజ
అయ్యప్పస్వామికి మంగళహారతి ఇస్తున్న భక్తులు

నిర్మల్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : అయ్యప్ప నామస్మరణతో హరిహరక్షేత్రం మారుమోగింది. పట్టణంతో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి స్వాములు హాజర య్యారు. పట్టణంలోని మల్లన్నగుట్టపైగల హరిహర క్షేత్రం అయ్యప్పస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి మండలపూజా కార్యక్రమం కన్నులపండుగగా జరిగింది. ఆలయ పూజా రి సదాశివశర్మ ఆధ్వర్యంలో ఉదయం ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళీధర్‌ రెడ్డి దంపతులు పాల్గొని గణపతిహోమంతో పాటు మండల పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ మండల పూజా కార్యక్రమానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంప తులు పాల్గొని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా క్షేత్రం యొక్క నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. మండల పూజా కార్యక్రమంలో స్వామివారికి పాలు, నెయ్యి, పన్నీరు, పంచామృతాలతో అభిషేకం జరిపారు. శ్రీకాంత్‌ భజన బృందం సభ్యులు పాడిన గీతాలు అలరించాయి. మండల పూజా కార్యక్రమానికి రాజన్‌ నంబూద్రి స్వామి 18 మెట్లపూజతో పడిని వెలిగించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గురు స్వామి పీఎన్‌ మూర్తి, గురుస్వాములు నర్సారెడ్డి, చిన్నయ్య, రమేష్‌, యువరాజ్‌, బద్రీ శ్రీను, ఆలయ కోశాధికారి సామల వేణుగోపాల్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-29T06:13:06+05:30 IST