కన్నుల పండువగా అయ్యప్ప పడి పూజలు

ABN , First Publish Date - 2020-12-28T06:05:30+05:30 IST

మండలంలోని కడ్తాల్‌ గ్రామంలో గల శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం రాత్రి అయ్యప్ప స్వామి మం డల పూజ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది.

కన్నుల పండువగా అయ్యప్ప పడి పూజలు
ఖానాపూర్‌లో అయ్యప్ప మండల పడిపూజ చేస్తున్న స్వాములు

సోన్‌, డిసెంబరు 27: మండలంలోని కడ్తాల్‌ గ్రామంలో గల  శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం రాత్రి అయ్యప్ప స్వామి మం డల పూజ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ గురుస్వామి నర్సారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్వాములు అధిక సంఖ్య లో హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారికి ఉత్సవ విగ్రహనికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం మండల పూజ విశిష్టతను తెలిపారు. స్వాములు ఆలపించిన భక్తి గీతాలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం పదునెట్టాంబడిని వెలిగించారు.

 దిలావర్‌పూర్‌: మండలంలోని కదిలి పాపహరేశ్వరాలయంలో ఆదివారం అయ్యప్ప పడిపూజ నిర్వహించారు. అంతకుముందు అయ్యప్ప భక్తులు కదిలి పాపహరేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. అయ్యప్ప స్వామివారికి పంచామృతాభిషేక పూజలు నిర్వహించారు.  ఆలయ అర్చకులు పంచాక్షరి, శంకర్‌, సిద్ధు పంతులు నేతృత్వంలో జరిగిన అయ్యప్ప పడిపూజలో నర్సాపూర్‌(జి), టెంబుర్ని, కుస్లి, మహరాష్ట్రలోని కీని, నిర్మల్‌ పట్టణం, సారంగాపూర్‌లోని పలు గ్రామాల అయ్యప్ప మాలధారులు పాల్గొన్నారు. పడిపూజ అనంతరం అన్నదానం చేశారు.

ఖానాపూర్‌: మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో ఆదివారం గురుస్వామి రాజూరా సత్యం ఆద్వర్యంలో మండలపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖానాపూర్‌, పెంబి, కడెం మండలాలతో పాటు జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ ప్రాంతం నుంచి అయ్యప్ప భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యి ప్రత్యేక పూజలు చేశారు. మండల పడిపూజతో పాటు ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదానం  చేశారు. 

ముథోల్‌: మండల కేంద్రంలోని కోలిగల్లీలో గల హనుమాన్‌ ఆలయం ఆవరణలో ఆదివారం స్థానిక అయ్యప్ప సేవా సంఘం ఆద్వర్యంలో శశాంక్‌గురుస్వామి చేతుల మీదుగా అయ్యప్ప మహా పడిపూజను అంగరంగ వైభవంగా చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప ఉత్సవ మూర్తికి పంచామృతాభిషేకం, సుగంధ్రవ్యాలు, వివిధ పండ్ల రసాలతో అభిషేకాలు, గణపతిపూజ, కుమారస్వామి, అయ్యప్పస్వామి, తదితర పూజాలు నిర్వహించారు. స్వాముల అయ్యప్ప గీతాలు, భజనలతో ప్రాంగణమంతా భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. కాగా, ముథోల్‌కు చెందిన దత్తత్రి గురుస్వామి అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టి 18ఏళ్లు పూర్తి కావడంతో ఆ నారికేల స్వామికి రుషితుల్యాపూజ చేశారు. అనంతరం అన్నదాన చేశారు. ఇందులో డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్‌, పోతన్న యాదవ్‌, అనీల్‌యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.  

నిర్మల్‌ టౌన్‌: కేరళలోని చిరపంజర పట్టణంలోని ముక్కాలపట్టం అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం జరిగిన మండల పూజా కార్యక్రమంలో నిర్మల్‌కు చెందిన కనపర్తి విఘ్నేష్‌ గురుస్వామి పాల్గొన్నారు.  అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచారసభ జాతీయ అధ్యక్షుడు అయ్యప్ప దాస్‌ ఆధ్వర్యంలో తనకు అవకాశం లభించిందని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-12-28T06:05:30+05:30 IST