పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
ABN , First Publish Date - 2020-12-29T04:21:47+05:30 IST
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు.

- ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్
తిర్యాణి, డిసెంబరు 28: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం తిర్యాణి ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అధికారులు, ప్రజాప్రతినిధులకు పచ్చదనం పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యం ఆరబెట్టుకోవడానికి నిలువ చేసుకోవడానికి కల్లాల నిర్మా ణాలను పూర్తి చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి ఆ గ్రామ సర్పంచ్‌లు, కార్యదర్శులపైన ఆధారపడి ఉంటుందని చెప్పారు. గ్రామాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు. పల్లెల్లో ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, రైతు వేదికలు నర్సరీలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళా సంఘాల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. మహిళలు ఈ విషయాన్ని గుర్తించుకుని అభివృద్ధి కార్యక్రమాలకు చేదోడు వాదోడు గా నిలువాలన్నారు. జిల్లాలో మారు మూల ప్రాంతాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. డీఎంఎఫ్‌టీ నిధులతో లింకు రోడ్లు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. 2020 సెప్టెంబరు వరకు పూర్తి చేసిన అన్ని అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించ నున్నామని చెప్పారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి అవి ఏ స్థాయిలో ఉన్నాయో ఎంబీలో రికార్డు చేయించడంతో పాటు వాటిని ఆన్‌లైన్‌లో కూడా పొందు పరిచే బాధ్యత సర్పంచ్, కార్యదర్శి తీసుకోవాలన్నారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందన్నారు. దీనికి కారణం పని 80 శాతం పూర్తైనప్పటికీ ఆన్‌లైన్‌లో 48 శాతంగా ఉందన్నారు. దీంతో ప్రభు త్వం 48 శాతానికే బిల్లుల చెల్లిస్తోందన్నారు. ఈ మేరకు సదరు కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లు బిల్లుల చెల్లింపు ఆలస్యమవు తుందని అనుకుంటున్నారని చెప్పారు. ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో సర్పంచ్‌లు, కార్యదర్శులు తడి, పొడి చెత్తకు సంబంధించి బుట్టలు పంపిణీ చేశారని అన్నారు. వాటిలో సూచించిన విధంగా తడి, పొడి చెత్తను వేర్వేరు చేయాలన్నారు. దీంతో పొడి చెత్తను ఎరువుగా మార్చడానికి అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఎంపీపీ శ్రీదేవి, జడ్పీటీసీ చంద్రశేఖర్, తహసీల్దార్ మష్కూర్ అలీ, ఎంపీడీవో మహేందర్, ఆయా శాఖ ల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.